Joram OTT: ఓటీటీలోకి వచ్చిన మనోజ్ బాజ్‍పేయ్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ‘జోరమ్’

Best Web Hosting Provider In India 2024

Joram OTT Streaming: విలక్షణ నటుడు మనోజ్ బాజ్‍పేయీ ప్రధాన పాత్ర పోషించిన ‘జోరమ్’ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. పలు అంతర్జాతీయ ఫిల్మ్స్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై భేష్ అనిపించుకుంది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీకి దేవాశీశ్ మకీజా దర్శకత్వం వహించారు. జోరమ్ చిత్రం డిసెంబర్ 8వ తేదీన థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

జోరమ్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టింది. హిందీలో స్ట్రీమ్ అవుతుంది. అయితే, ప్రస్తుతం ఈ సినిమా రూ.199 రెంట్‍తో అందుబాటులోకి ఉంది. అంటే ఈ చిత్రం చూడాలంటే ప్రైమ్ వీడియో సబ్‍స్క్రిప్షన్ ఉన్న వారు కూడా ఆ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం రెంటల్ విధానంలో జోరమ్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అయితే, కొంతకాలం తర్వాత సబ్‍స్క్రైబర్లందరూ ఉచితంగా చూసేందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చిత్రంలో వలస కార్మికుడిగా మనోజ్ బాజ్‍పేయీ నటించారు. హత్య చేయాలనుకునే వారి నుంచి తన పసిబిడ్డను రక్షించుకునేందుకు సవాళ్లను ఎదుర్కోవడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది.

జోరమ్ మూవీలో మహమ్మద్ జీషమ్ అయుబ్, స్మిత తాంబే, మేఘా మాథుర్, తనిష్ట చటర్జీ, రాజ్‍శ్రీ దేశ్‍పాండే, అపూర్వ డోంగర్వల్ కీలకపాత్రలు పోషించారు. దేవాశీశ్ మకీజా దర్శకత్వం వహించిన ఈ మూవీకి మగేశ్ దక్డే సంగీతం అందించారు. జీ స్టూడియోస్, మఖీజా ఫిల్మ్స్ పతాకంపై షరీక్ పటేల్, అషిమా అవస్థి చౌదరీ, అనుపమ బోస్, దేవాన్శిశ్ మఖీజా నిర్మించారు.

ఈ అంతర్జాతీయ ఫిల్మ్స్ ఫెస్టివల్స్‌లో..

జోరమ్ చిత్రం 2023లో రెటెర్‌డామ్‍ (నెదర్లాండ్స్)లో ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ఫెస్టివల్‍లో ప్రదర్శితమైంది. 70వ సిడ్నీ ఫిల్మ్స్ ఫెస్టివల్, డర్బన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, 28వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ఫెస్టివల్, 59వ చికాగో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో ప్రదర్శితమైంది. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి స్టాండిగ్ ఓవియేషన్ దక్కింది. ఆస్కార్ లైబ్రరీలోనూ పర్మినెంట్ కోర్ కలెక్షన్లలో ఈ చిత్రం చోటు దక్కించుకుంది.

ఇటీవల ప్రకటించిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోనూ జోరమ్ మూవీకి గుర్తింపు దక్కింది. క్రిటిక్స్ ఉత్తమ సినిమా, ఉత్తమ కథ విభాగాల్లో ఈ చిత్రానికి అవార్డులు దక్కాయి.

జార్ఖండ్ నుంచి ముంబై వచ్చి భవన నిర్మాణ పనులు చేసుకునే దాస్రు కర్కెట్టా అలియాజ్ బాలా (మనోజ్ బాజ్‍పేయీ) భార్య హత్యకు గురవుతుంది. దాస్రు, అతడి మూడు నెలల కూతురు జోరమ్ ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుంది. దీంతో తమను మట్టుబెట్టాలని ప్రయత్నించే శక్తివంతమైన మనుషులు, వ్యవస్థ నుంచి దాస్రు తప్పించుకునేందుకు చాలా కష్టాలను ఎదుర్కొంటాడు. అతడికి హింసాత్మక గతం కూడా ఉంటుంది. చంపాలనుకునే వారి నుంచి తనను, తన బిడ్డను దాస్రు ఎలా కాపాడుకున్నాడు.. ఈ ప్రయత్నంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడన్నదే జోరమ్ చిత్రం ప్రధాన అంశాలుగా ఉన్నాయి.

జోరమ్ మూవీ ఆద్యంతం థ్రిల్లింగ్‍గా, ఆలోచనాత్మకంగా సాగుతుంది. చాలా సామాజిక అంశాలు కూడా మిళితమై ఉంటాయి. ఈ చిత్రంలో మనోజ్ బాజ్‍పేయీ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024