Best Web Hosting Provider In India 2024
Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ గతేడాది లియో చిత్రంతో బ్లాక్‍బాస్టర్ సాధించారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బ్లాక్‍బాస్టర్ అయింది. ప్రస్తుతం విజయ్.. ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్‍టైమ్’ చిత్రం చేస్తున్నారు. మానాడు ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీగా ఇది రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. అయితే, ఈ తరుణంలోనే రాజకీయ పార్టీని ప్రకటించారు దళపతి విజయ్. తమిళగ వెట్రి కజగమ్ పార్టీని స్థాపించారు. ఈ విషయంపై నేడు (ఫిబ్రవరి 2) అధికారిక ప్రకటన చేశారు. దీంట్లోనే తన చివరి సినిమా గురించి కూడా హింట్ ఇచ్చారు విజయ్.
ట్రెండింగ్ వార్తలు
రాజకీయ రంగ ప్రవేశం ప్రకటించటంతో దళపతి విజయ్ ఆఖరి సినిమా ఏదన్న ఆసక్తి నెలకొంది. అయితే, ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్‍టైమ్’ తర్వాత ఇంకో సినిమా చేస్తానని తన ప్రకటనలో విజయ్ పేర్కొన్నారు. ఇది విజయ్‍కు 69వ మూవీ (Thalapathy 69)గా ఉండనుంది. తాను రాజకీయాలపై ఎంత సీరియస్‍గా ఉన్నానో కూడా ఆయన తెలిపారు.
రాజకీయాలు హాబీ కాదు
“రాజకీయాలు నాకు ఇంకో కెరీర్ మాత్రమే కాదు. ప్రజల కోసం చేసే పవిత్రమైన పని ఇది. మనలో నుంచి చాలా పాఠాలను నేర్చుకుంటూనే చాలా కాలంగా రాజకీయాల కోసం సిద్ధమవుతున్నా. నాకు పాలిటిక్స్ హాబీ కాదు. ఇది నాకు చాలా ప్రగాఢమైన ఆకాంక్ష. రాజకీయాల్లో పూర్తిస్థాయిలో ఉండాలనుకుంటున్నా. నేను ఇంతకు ముందే అంగీకరించిన మరో సినిమాను పూర్తి చేస్తా. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటా. పార్టీ పనులు, ప్రజల సేవ కోసం కట్టుబడతా. తమిళనాడు ప్రజలకు ఇది నేను కృతజ్ఞతగా భావిస్తున్నా” అని దళపతి విజయ్ పేర్కొన్నారు.
ఆర్ఆర్ఆర్ మేకర్స్‌తో..
ది గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్‍టైమ్ తర్వాత దళపతి విజయ్.. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై మూవీ చేయనున్నారని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ మూవీని ప్రొడ్యూజ్ చేసిన డీవీవీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని టాక్. అలాగే, సన్ పిక్చర్స్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగమవుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. దీంతో తనకు 69వ మూవీనే చివరిదని విజయ్ చెప్పేశారు. ఈ సినిమాపై ప్రకటన మార్చి లేకపోతే ఏప్రిల్‍లో వస్తుందని సమాచారం.
2024 లోక్‍సభ ఎన్నికల్లో తన పార్టీ తమిళగ వెట్రి కజగమ్ పోటీ చేయదని, ఎవరికీ మద్దతు ఇవ్వదని విజయ్ తెలిపారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగుతుందని స్పష్టం చేశారు. తన చివరి సినిమాను 2025 సంక్రాంతికే రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకోవాలని, ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించాలనే టార్గెట్ పెట్టుకున్నారు విజయ్.
మరి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత విజయ్ మళ్లీ సినిమాల్లోకి వస్తారా లేదా అనేది ఫలితాలపై ఆధారపడి ఉండే అవకాశాలు అధికంగా ఉంటాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. విజయ్ లాస్ట్ మూవీ అంటూ హింట్ ఇవ్వడంతో కొందరు అభిమానులు సోషల్ మీడియాలో బాధ వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్