Hyderabad Biryani : సింపుల్‌గా హైదరాబాద్ బిర్యానీ తయారు చేయడం ఎలా?

Best Web Hosting Provider In India 2024

హైదరాబాద్ అనగానే మెుదట గుర్తుకు వచ్చేది బిర్యానీ. ఇది విదేశాల్లోనూ ఫేమస్. తయారుచేయడం కూడా చాలా సులభం. చాలా మంది బిర్యానీ తినేందుకు కూడా హైదరాబాద్ వస్తుంటారు. ఒక్కసారైనా టేస్ట్ చూడాలనుకుంటారు. అయితే దీని తయారీ విధానం గురించి కొందరు ఇబ్బంది పడుతుంటారు. ఎలా చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. హైదరాబాద్ బిర్యానీ తయారు చేయడం చాలా సులభం. ఈజీగా తయారు చేయెుచ్చు. పిల్లలు, పెద్దలు ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ లాగించేస్తారు. హైదరాబాద్ బిర్యానీ చేయడానికి కావలసిన పదార్థాలు, ఎలా తయారు చేయాలో చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

ఇంటికి ఎవరైనా బంధువులు, స్నేహితులు వచ్చినప్పుడు హైదరాబాద్ బిర్యానీ తయారు చేసి పెట్టండి. ఇక మీ చేతి వంట చూసి ఫిదా అయిపోతారు. బిర్యానీ చేసేందుకు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే.. మనం తయారు చేసే మసాలానే. దాని మీదనే బిర్యానీ టేస్ట్ ఆధారపడి ఉంటుంది. హోటళ్లలో అంత రుచిగా హైదరాబాద్ బిర్యానీ ఉండేందుకు అదే కారణం. ఇంతకీ హైదరాబాద్ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు

చికెన్ – 1 కిలోలు

బాస్మతి బియ్యం – 1/2 కిలోలు

బిర్యానీ ఆకు – 4

స్టార్ సోంపు – 4

ఏలకులు – 6

షాహి జీరా – 1 టీస్పూన్

నల్ల మిరియాలు – 1 టీస్పూన్

బిర్యానీ మసాలా – 2 టేబుల్ స్పూన్లు

బ్రౌన్ వేయించిన ఉల్లిపాయలు – 1 కప్పు

ఎర్ర కార పొడి – 2 టేబుల్ స్పూన్లు

ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్

జీలకర్ర – 1 టీస్పూన్

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్

పెరుగు – 1 కప్పు

పసుపు – 1/4 టీస్పూన్

తరిగిన కొత్తిమీర ఆకులు – 1 కప్పు

తరిగిన పుదీనా – 1/2 కప్పు

పచ్చిమిర్చి – 5

నూనె – 1/2 కప్పు

నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు

ఉప్పు – రుచి ప్రకారం

కుంకుమ పువ్వులు- చిటికెడు

నెయ్యి – కొద్దిగా

హైదరాబాద్ బిర్యానీ తయారీ విధానం

ముందుగా చికెన్‌ను 4-5 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి.

చికెన్‌లో ఉప్పు, కార పొడి, అల్లం వెల్లుల్లి వేసి బాగా కలపాలి.

ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర తరుగు వేయాలి.

బిర్యానీ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, వేయించిన ఉల్లిపాయ, కొద్దిగా నూనె వేసి మళ్లీ కలపాలి.

ఈ చికెన్‌లోనే పెరుగు వేసి కలపాలి, 1 గంట మ్యారినేట్ చేయాలి.

బాస్మతి బియ్యాన్ని ఒకసారి కడిగి నీళ్లు పోసి అరగంట నాననివ్వాలి.

బియ్యం కోసం స్టవ్ మీద కొద్దిగా నీటిని వేడి చేసి, దానికి కొద్దిగా ఉప్పు వేయండి.

తర్వాత షాహి జీర్, కొద్దిగా నూనె, నెయ్యి వేసుకుని, నానబెట్టిన బియ్యం వేసి ఒకసారి కదిలించాలి.

మ్యారినేట్ చేసిన చికెన్‌లో మిర్చి, జీలకర్ర, లవంగాలు, కొత్తిమీర, స్టార్ సోంపు, జీలకర్ర, లవంగాలు, యాలకులు జోడించండి.

కొద్దిగా పుదీనా వేసి, మిగిలిన ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి వేయించాలి.

80 శాతం ఉడికిన బాస్మతి బియ్యాన్ని మ్యారినేట్ చేసిన చికెన్ మీద వేయండి. అయితే చికెన్ మెుత్తం కింద ఉండనివ్వకూడదు.

పైన మరో లేయర్ రైస్ వేసి పైన కుంకుమపువ్వు వేసి మూత గట్టిగా మూయాలి.

ఇలా పైన ఒక్కో లేయర్ రైస్, మరొక లేయర్ చికెన్ వేస్తూ మూడు నాలుగు లేయర్స్ వేసుకోవాలి.

హైదరాబాద్ బిర్యానీని అతి తక్కువ మంట మీద 20 నిమిషాలు ఉడికించాలి. కావాలంటే దమ్ కూడా పెట్టుకోవచ్చు.

అంతే హైదరాబాద్ బిర్యానీ తినేందుకు సిద్ధంగా ఉంది.

రైతాతో హైదరాబాద్ బిర్యానీని ఆస్వాదించండి.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024