ఏలూరుకు త‌ర‌లివెళ్లిన జ‌గ్గ‌య్య‌పేట పార్టీ శ్రేణులు

Best Web Hosting Provider In India 2024

ఎన్టీఆర్ జిల్లా:  జన బలమే గీటురాయిగా, సామాజిక న్యా­య­మే అభిమతంగా శాసనసభ, లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తల నియామకంపై కసరత్తు చేస్తూనే.. మరోవైపు 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, సీఎం వైయ‌స్‌ జగన్‌ సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 63 శాసనసభ, 16 లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తల్ని నియమించడంతో పాటు ‘సిద్ధం’ పేరుతో శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా గత శనివారం విశాఖపట్నం జిల్లా భీమిలి వేదికగా ఎన్నికల సమరానికి శంఖం పూరించారు. ఆ సభ సూపర్‌హిట్‌ అయిన నేపథ్యంలో శనివారం ఏలూరులో ‘సిద్ధం’ రెండో సభ నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లా దెందులూరులో జరగనున్న “సిద్ధం” భారీ బహిరంగ సభకు జగ్గయ్యపేట నియోజకవర్గ వ్యాప్తంగా వైయస్ఆర్ సీపీ శ్రేణులు పెద్దయెత్తున తరలివెళ్ళారు. పట్టణంలోని ఎస్‌జీఎస్ కళాశాల ఆవరణలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను  “సిద్ధం‌” సభ  వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

ఆసరా పథకంతో అక్కచెల్లెమ్మలకు ఆర్థిక భరోసా..
వైయ‌స్ఆర్‌ ఆసరా పథకంతో అక్కచెల్లెమ్మలకు ఆర్థిక భరోసా లభిస్తుందని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను అన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గం, వత్సవాయి మండలం, పోలంపల్లి గ్రామం నందు 1.60 కోట్ల రూపాయలతో పోలంపల్లి – చిన్నమండవ రోడ్డు, అంగన్వాడి కేంద్రం, సొసైటీ గోదాం తదితర అభివృద్ధి ప్రారంభ కార్యక్రమాలు,పోలంపల్లి గ్రామంలో 912 మంది పొదుపు సంఘాల్లోని అక్కాచెల్లెళ్లకు వైయస్ఆర్‌ ఆసరా పథకం క్రింద సుమారు రూ.72 లక్షల చెక్కును రాష్ట్ర ప్రభుత్వవిప్ శాసనసభ్యులు సామినేని ఉదయభాను , ఆయ‌న‌ సతీమణి సామినేని విమలభాను  అందజేశారు.

ఈ సందర్భంగా ఉదయభాను  మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు మహిళలకు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చకుండా మోసం చేశారని ఆరోపించారు. నేడు సీఎం వైయ‌స్ జగన్‌ ఆసరా పథకం ద్వారా పూర్తి రుణ మాఫీ చేశారన్నారు. రాబోయే ఎన్నికల్లో మహిళలందరూ వైయ‌స్ జ‌గన్‌ను ఆశీర్వదించి మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.

కోటి రూపాయలతో పోలంపల్లి – చిన్నమండవ రోడ్డు.

పోలంపల్లి – చిన్నమండవ రోడ్డు ఇదివరకు రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడం వల్ల ముఖ్యంగా ఆంధ్ర – తెలంగాణ రైతులు పంట పొలాలకు వెళ్లేందుకు, పొలానికి మందు కట్టలు తెచ్చుకోవాలన్నా అనేక ఇబ్బందులు పడేవారని అన్నారు. ప్రజలు ఖమ్మం తదితర ప్రాంతాలకు వెళ్లాలన్న నానాయాతన పడేవారని చెప్పారు. కనీసం ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు కూడా ఈ రోడ్డు అనువుగా ఉండేది కాదని తెలిపారు. దశాబ్దాల నుంచి ఈ రోడ్డును పట్టించుకున్న నాథుడే లేడని, దీంతో ప్రజల చిరకాల వాంఛ తీర్చినట్లయిందని ఉదయభాను చెప్పారు. 

Best Web Hosting Provider In India 2024