ప్రజలే కృష్ణుల్లా వైయ‌స్‌ జగన్‌ను ముందుకు నడిపిస్తున్నారు

Best Web Hosting Provider In India 2024

పెత్తందారీ చంద్ర‌బాబుకు స‌ర్వ‌ర్లంటే అంత చిన్న‌చూపా..?

చంద్రబాబు రిజెక్ట్ చేసి బాలశౌరిని పవన్ పక్కకు పంపాడు

మాజీ మంత్రి, వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని

అసెంబ్లీ: త‌మ‌ను ఆర్థికంగా, సామాజికంగా, రాజ‌కీయంగా ఆదుకున్న రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ప్ర‌జ‌లే కృష్ణుల్లాగా ముందుకు న‌డిపిస్తున్నార‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద పేర్ని నాని మాట్లాడారు. సీఎం వైయ‌స్ జగన్ ఫొటో పెట్టుకొని బాలశౌరి ఎంపీగా గెలిచాడని, ఇప్పుడు పార్టీ మారి సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నాడని మండిప‌డ్డారు. జంపింగ్ జపాంగ్‌ని వీరుడిలా పవన్ భావిస్తున్నాడని, కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత పవన్ కి లేదన్నారు. శత్రువులతో షర్మిల చేతులు కలిపి, బజారుకెక్కి సొంత అన్ననే దూషిస్తున్నారని, సీఎం అనుచరులు చూస్తూ ఊరుకొంటారా..? అని ప్ర‌శ్నించారు. 

తల్లిని తిట్టిన వాళ్ళ పల్లకీ మోసే పవన్‌ని ఏమనాలని పేర్ని నాని ప్ర‌శ్నించారు. జరగబోయే కురుక్షేత్రంలో పవన్ ది శల్యుడి పాత్ర అని ఎద్దేవా చేశారు. పవన్‌ని సీఎంగా చూడాలన్న కార్యకర్త స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాడని, చంద్రబాబు రిజెక్ట్ చేసి బాలశౌరిని పవన్ పక్కకు పంపాడన్నారు. నాదెండ్ల మనోహర్ కాళ్ళు పట్టుకొని బాలశౌరి జనసేనలో దూరారని దుయ్య‌బ‌ట్టారు. ఆశ్రయం, అధికారం, అర్హత కల్పించిన సీఎం వైయ‌స్ జగన్ గురించి మాట్లాడే అర్హత బాలశౌరికి లేదన్నారు. శక్తులన్నీ ఏకమై కౌరవుల్లా వచ్చినా వైయ‌స్‌ జగన్ లాంటి అర్జునుడిని ఏమీ చేయలేరని స్ప‌ష్టం చేశారు. కాపు కులాన్ని పణంగా పెట్టి చంద్రబాబు పల్లకీ మోయవద్దు అని హరిరామ జోగయ్య కూడా లేఖ రాశార‌ని గుర్తుచేశారు. హుందాగా వ్యవహరించాలని పవన్ కి సూచించారు. కమ్మలు, రెడ్లు లాగే అధికారం కోసం పోరాడామని లేఖలో కోరారు. వ్యక్తిత్వ హననం చేస్తూ సీఎం వైయ‌స్ జగన్‌ని మాట్లాడితే చూస్తూ ఊరుకోమ‌ని హెచ్చ‌రించారు. త‌న‌ను  సర్వర్‌లా చంద్రబాబు అభివర్ణించాడ‌ని, పెత్తందారీ చంద్రబాబుకి సర్వర్లంటే అంత చిన్నచూపా అని పేర్ని నాని ప్ర‌శ్నించారు. 

Best Web Hosting Provider In India 2024