టీడీపీ పాలనలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదు

Best Web Hosting Provider In India 2024

సీఎం వైయ‌స్ జగన్‌.. విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేశారు

అసెంబ్లీలో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్‌బాబు

అమ‌రావ‌తి: టీడీపీ పాలనలో రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఎందుకు పెట్టలేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్‌బాబు ప్ర‌శ్నించారు. సీఎం వైయ‌స్ జగన్‌.. విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేశార‌ని తెలిపారు.  ఆంధప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సంయుక్త సమావేశాల్లో భాగంగా రెండో రోజు(మంగళవారం) గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో ఎమ్మెల్యే సుధాక‌ర్‌బాబు మాట్లాడారు. ఈ స‌మ‌యంలో టీడీపీ స‌భ్యులు పేప‌ర్లు చించి స్పీక‌ర్‌పై విసిరివేయ‌డం ప‌ట్ల సుధాక‌ర్‌బాబు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. టీడీపీ సభ్యులు సభా సంప్రదాయాలను పాటించడం లేద‌ని త‌ప్పుప‌ట్టారు. బలహీన వర్గాలకు చెందిన స్పీకర్‌ను అవమానించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. టీడీపీ సభ్యులు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేద విద్యార్థులకు విద్యను చేరువ చేశార‌ని సుధాక‌ర్‌బాబు తెలిపారు. టీడీపీ పాలనలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఎందుకు పెట్టలేద‌ని ప్ర‌శ్నించారు. సీఎం వైయ‌స్ జగన్‌.. విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేశార‌ని చెప్పారు. విద్యాకానుక కింద రూ. 11,901 కోట్లు అందించాం, విద్యా దీవెన కింద రూ. 4, 276 కోట్లు అందించాం, రాష్ట్రంలో 17 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. సీఎం వైయ‌స్ జగన్‌ హయాంలో విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొచ్చార‌ని టీజేఆర్ సుధాక‌ర్‌బాబు వివ‌రించారు.

Best Web Hosting Provider In India 2024