సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా వైయ‌స్‌ జగన్ పాలన

Best Web Hosting Provider In India 2024

వైయ‌స్ఆర్‌సీపీ ఉరవకొండ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి 

అనంత‌పురం:   వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ నలుగున్నరేళ్లలో రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి ల‌క్ష్యంగా పాల‌న సాగుతోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఉరవకొండ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఉరవకొండ పట్టణంలోని గాంధీ బజార్, లాల్ స్వామి గుడి ప్రాంతాల్లో వద్ద రూ.25 లక్షలతో నిర్మించతలపెట్టిన సిసి పనులకు శంకుస్థాపన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. సర్పంచ్ లలిత, ఎంపిపి నరసింహులు, జెడ్పిటిసి పార్వతమ్మ, ఉప సర్పంచ్ వన్నప్ప,మాజీ ఎంపీపీ చంద్రమ్మ లతో కలిసి మాజీ ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధే లక్ష్యంగా జగనన్న పాలన సాగిస్తున్నారని తెలిపారు. ఆయన రూపొందించి అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమంతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని వివరించారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజి వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు తమ సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు నిబద్ధతగా పనిచేస్తున్నారని తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. తాగునీరు, మురుగునీటి వసతులను మెరుగుచేశామన్నారు. ఇప్పటి వరకు పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు పంచాయతీ, మండల నిధులతో పాటు గడప గడప, ఇతర నిధుల ద్వారా రూ.10 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఓబులమ్మ, పద్మావతి, శర్మస్, రేణుక, వాసుదేవుడు, ఎంపిటిసి ఈడీగా ప్రసాద్, కో అప్షన్ పామిడి సలీమ్, మాజీ జెడ్పిటిసి తిప్పయ్య, నాయకులు బసవరాజు, సాధు కుల్లాయిస్వామి, ఎంసి నాగభూషణం, మీనుగా ఎర్రిస్వామి, జికేఎస్ సుబ్బలక్ష్మి, ఆటో సీనా, రఫీ, బుసన్న గారి మల్లికార్జున, అంగదాల అంజి, ఓబులేసు,గాదిలింగా, బీరే శివ,శర్మస్, జోగి భీమన్న, లాలుస్వామి తదితరులు పాల్గొన్నారు.

Best Web Hosting Provider In India 2024