Best Web Hosting Provider In India 2024
వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
అమరావతి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర్నుంచీ నేటి వరకూ ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ధృడమైన సంకల్పంతో పని చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో జక్కంపూడి రాజా మాట్లాడారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ పేదలకు చేయూత ఇచ్చారని గుర్తు చేశారు. వైయస్ రాజశేఖర్‌రెడ్డి మరణ తర్వాత మళ్లీ వెనుకబడ్డామనే భావన కల్గిందన్నారు. 2009 నుంచి 2019 వరకూ గడ్డు పరిస్థితుల్నే ఎదుర్కొన్నామన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు ఏదో రకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకోవాలని దురాలెచనతో 650 హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఆపై ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని మండిపడ్డారు. ఆ తరుణంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను వైయస్ జగన్ చూశారు. అందుకోసం సుదీర్ఘమైన పాదయాత్ర చేసిన వైయస్ జగన్.. ప్రజల కష్టాలను తెలుసుకున్నారు
అప్పట్నుంచి పేదవాడి కష్టాలను తీర్చాలనే లక్ష్యంతో పని చేస్తున్న నాయకుడు సీఎం వైయస్ జగన్ అని ఎమ్మెల్యే రాజా పేర్కొన్నారు.