Best Web Hosting Provider In India 2024
Sour curd Vs Normal Curd: సాంప్రదాయ భారతీయ భోజనంలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్ని కూరలు కలుపుకొని తిన్నా చివరకు పెరుగుతోనే భోజనాన్ని ముగించాలి. అప్పుడే అది సంపూర్ణ భోజనం అవుతుంది. పెరుగు ఆరోగ్యానికి మేలే చేస్తుంది. కాబట్టి పోషకాహార నిపుణులు ప్రతిరోజూ కప్పు పెరుగును తినమని సూచిస్తారు. అయితే కొంతమంది ఇళ్లల్లో పెరుగు పులిసిపోతుంది. పులిసిన పెరుగును తినడానికి ఎక్కువ మంది ఇష్టపడరు. సాధారణ పెరుగు టేస్టీగా ఉంటుంది. ఆ రుచి కోసం సాధారణ పెరుగును తినడానికి ఇష్టపడతారు. అయితే సాధారణ పెరుగు లేదా పులిసిన పెరుగు ఈ రెండింటిలో ఏది తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎక్కువ మేలు కలుగుతుందో తెలుసుకుందాం. తెలుగులో మంచి కొవ్వులు, కాల్షియం, ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజూ పెరుగు తినడం అనేది కచ్చితంగా చేయాలి. అయితే పులిసిన పెరుగు తినాలా వద్దా అనేదే ఎక్కువమందికున్న
ట్రెండింగ్ వార్తలు
పెరుగు ఎందుకు తినాలి?
పెరుగు సహజంగా పోషకాలతో నిండి ఉంటుంది. రోజువారీ ఆహారంలో పెరుగు తినడం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. దీనిలో ఉండే కాల్షియం ఎముకలకు బలాన్ని అందిస్తుంది. అలాగే ప్రోటీన్ కండరాలకు శక్తిని అందిస్తుంది. అలాగే కణాల మరమ్మత్తు సహాయపడుతుంది. తెలుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా పొట్టలోని గట్ మైక్రో బయోమ్ కి రక్షణ కల్పిస్తాయి. మొత్తం మీద రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. మొత్తం మీద పెరుగు తినడం మన ఆరోగ్యానికి చాలా అవసరం
పుల్లని పెరుగు తినవచ్చా?
ఒక్కొక్కసారి పెరుగు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండడం వల్ల పులిసిపోతుంది. దీన్ని తినాలా వద్దా అన్నది ఆ వ్యక్తి ఆరోగ్యం పై ఆధారపడి ఉంటుంది. పుల్లని పెరుగు తినడం వల్ల కొన్ని సానుకూల ప్రభావాలు ఉన్నాయి. అలాగే ప్రతికూల ప్రభావాలు కూడా కనిపిస్తాయి. పుల్లని పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి పేగు ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తాయి. సాధారణ పెరుగుతో పోలిస్తే పుల్లని పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి పేగుల ఆరోగ్యం కోసం పుల్లని పెరుగు తినాల్సిందే. ఎవరైతే జీర్ణ క్రియ సమస్యలతో బాధపడతారో, తరచూ జలుబు, శ్వాస కోశ సమస్యలతో సతమవుతమవుతూ ఉంటారో వారు మాత్రం పుల్లని పెరుగుకు దూరంగా ఉంటే మంచిది. పుల్లని పెరుగు ఆ సమస్యలను మరింతగా పెంచేస్తుంది. పుల్లని పెరుగు అధికంగా తినడం వల్ల శరీరంలో శ్లేష్మం కూడా ఎక్కువగా పెరిగిపోతుంది. కాబట్టి జలుబు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఆయుర్వేదం కూడా ఈ విషయాన్ని చెబుతోంది. లాక్టోజ్ ఇంటాలరెన్స్ వంటి సమస్యలు ఉన్నవారు కూడా పుల్లని పెరుగును తక్కువగా తీసుకోవాలి. లేకపోతే పొట్ట ఉబ్బరం, అసౌకర్యంగా అనిపించడం, విరోచనాలు కావడం వంటివి జరుగుతాయి. కాబట్టి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు పుల్లని పెరుగును తింటే మంచిది. శ్వాసకోశ సమస్యలు, జలుబు వంటివి ఉన్నవారు పుల్లని పెరుగుకు దూరంగా ఉండాలి