Best Web Hosting Provider In India 2024
The Kerala Story OTT Release Date: గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మూవీ ది కేరళ స్టోరీ. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా మొత్తానికి 9 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 16 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రముఖ ఓటీటీ జీ5 వెల్లడించింది.
ట్రెండింగ్ వార్తలు
ది కేరళ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్
ది కేరళ స్టోరీ(The kerala Story) మూవీ 2023, మే 5న థియేటర్లలో రిలీజైంది. అదా శర్మ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా తీవ్ర దుమారం రేపింది. కేరళలో అమాయక యువతులను ఎలా వలలో వేసుకొని, మతం మార్చి ఐసిస్ లాంటి ప్రమాదకర ఉగ్రవాద సంస్థల్లో జాయిన్ చేస్తున్నారో చూపిస్తూ ఈ సినిమా సాగింది. ఈ మూవీ అంతకుముందు ఏడాది ది కశ్మీర్ ఫైల్స్ లాగే తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది.
అప్పటి నుంచీ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఎన్నో అడ్డంకుల తర్వాత జీ5 (Zee 5) ఓటీటీలో ది కేరళ స్టోరీ మూవీ ఫిబ్రవరి 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ రివీల్ చేస్తూ.. జీ5 ఓ వీడియో రిలీజ్ చేసింది. కేరళ స్టోరీ ఓటీటీలో ఎప్పుడు అని ఎంతో మంది ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలను వీడియో మొదట్లో ఉంచారు.
ఆ తర్వాత మోస్ట్ అవేడెట్ మూవీ వచ్చేస్తోంది.. ఇక ఏమాత్రం వేచి చూడాల్సిన అవసరం లేదు.. ఫిబ్రవరి 16 నుంచి జీ5 ఓటీటీలో ది కేరళ స్టోరీ స్ట్రీమింగ్ కానుంది అని ఆ డిజిటల్ ప్లాట్‌ఫామ్ వెల్లడించింది.
ది కేరళ స్టోరీలో అసలు ఏముంది?
ది కేరళ స్టోరీ సినిమాకు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించగా.. అదా శర్మ ప్రధాన పాత్రలో నటించారు. కేరళకు చెందిన 32,000 మంది హిందూ అమ్మాయిలను మోసపూరితంగా కొందరు ఇస్లాం మతంలోకి మార్చి.. ఐసిస్‍లోకి పంపారని ది కేరళ స్టోరీ సినిమా ట్రైలర్‌లో ఉండటంతో తీవ్ర దుమారం రేగింది. అయితే, కేరళకు చెందిన ముగ్గురు అమ్మాయిల యథార్థ కథ ఇది అని గత వారం ప్రోమోను మార్చింది ఆ చిత్ర యూనిట్.
ఈ సినిమా రిలీజైన సమయంలో తీవ్ర వివాదం తలెత్తింది. బెంగాల్ లో ఈ మూవీపై నిషేధం విధించారు. ఆ తర్వాత కూడా ఓటీటీలోకి రావడానికి చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. మొదట అసలు ఈ సినిమాను తీసుకోవడానికి ఏ ఓటీటీ ముందుకు రాలేదు. మధ్యమధ్యలో ది కేరళ స్టోరీ ఓటీటీలోకి వచ్చేస్తోందన్న వార్తలు వచ్చినా.. అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి.
మొత్తానికి 9 నెలల తర్వాత ఈ మూవీ ఫిబ్రవరి 16న ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్న ఆసక్తి నెలకొంది.