Best Web Hosting Provider In India 2024
Rashmika Mandanna Remuneration: యానిమల్, పుష్ప: ది రైజ్ వంటి చిత్రాల్లో నటించిన రష్మిక మందన్న రెమ్యునరేషన్ గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. రీసెంట్ గా ఆమె రెమ్యునరేషన్ పెంచిందని, ఒక్కో సినిమాకు రూ.4-4.5 కోట్లు తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా సోషల్ మీడియా ఎక్స్ ద్వారా రష్మిక స్పందించింది.
ట్రెండింగ్ వార్తలు
పుకార్లకు తెరదించిన రష్మిక
ఫిల్మీ బౌల్ అనే ఆన్ లైన్ పోర్టల్ రష్మిక మందన్నా రెమ్యునరేషన్ పై తమ ఎక్స్ ఖాతాలో ‘బజ్’ అని రాసుకొచ్చింది. #Animal సక్సెస్ తర్వాత #RashmikaMandanna తన రెమ్యునరేషన్ ను మళ్లీ పెంచేసింది. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల నుంచి రూ.4.50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోందని ఆ పోర్టల్ రాసుకొచ్చింది.
ఈ పుకార్లు ఎక్కువ అవుతుండటంతో రష్మిక వెంటనే స్పందిస్తూ.. “నేను ఏమనుకుంటున్నానో తెలుసా.. ఇదంతా చూసిన తర్వాత నిజంగానే అలాగే చేయాలని అనిపిస్తోంది. ప్రొడ్యూసర్లు ఎందుకు అని అడిగితే నేనంటాను.. మీడియానే ఇదంతా చెబుతోంది సార్.. వాళ్లు చెప్పినదానిని నేను నిజం చేయాలి కదా.. నేనేం చేయగలను?” అని రష్మిక పోస్ట్ చేసింది.
యానిమల్ మూవీలో రష్మిక
రష్మిక చివరి చిత్రం, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్. రణబీర్ కపూర్ తో కలిసి నటించింది. ఈ చిత్రంలో ఆమె గీతాంజలిగా కనిపించింది. ఆల్ఫామేల్ అంటూ హీరో చెప్పే స్టోరీకి టెంప్ట్ అయిపోయి తన ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకొని మరీ అతన్ని పెళ్లి చేసుకుంటుంది.
ఆ తర్వాత హీరో రణ్‌విజయ్ సింగ్ మాత్రం తన తండ్రిపై ఉన్న ప్రేమ పిచ్చిలో పడి తన చేయి దాటిపోతున్న సమయంలో అతన్ని వదిలిపెట్టాలని చూసే పాత్రలో రష్మిక కనిపించింది. యానిమల్ మూవీలో రష్మిక పాత్రపై ఎన్నో నెగటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. కొన్ని సీన్లలో ఆమె రెచ్చిపోయిన నటించడం, మితిమీరిన లిప్ లాక్స్ కూడా ఉన్నాయి.
యానిమల్ మూవీకి యానిమల్ పార్క్ పేరుతో సీక్వెల్ కూడా రాబోతోంది. యానిమల్ రిలీజ్ కు ముందే సీక్వెల్ ను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వెల్లడించాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మొదలు కానున్నట్లు ఈ మధ్యే రణ్‌బీర్ కపూర్ కూడా చెప్పాడు. యానిమల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ సాధించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చి అక్కడ కూడా రికార్డులు క్రియేట్ చేస్తోంది.
రష్మిక తర్వాతి సినిమాలు ఇవే..
ప్రస్తుతం రష్మిక వివిధ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. పుష్ప సీక్వెల్ పుష్ప ది రూల్ మూవీతో ఈ ఏడాది ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంతేకాకుండా రెయిన్‌బో, ది గర్ల్‌ఫ్రెండ్స్ మూవీస్ లోనూ ఆమె నటిస్తోంది. హిందీలో చావా అనే మరో మూవీ చేస్తోంది.
యానిమల్ మూవీతోపాటు అంతకుముందు రష్మిక ఒక్కో సినిమా కోసం రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. అయితే తాజాగా ఆమె ఇచ్చిన క్లారిటీని బట్టి చూస్తే.. యానిమల్ తర్వాత కూడా రష్మిక తన రెమ్యునరేషన్ ను పెంచలేదని తెలుస్తోంది.
టాపిక్