దేశంలోనే డర్టీ పొలిటీషియన్‌ చంద్రబాబు

Best Web Hosting Provider In India 2024

 మంత్రి ఆర్కే రోజా

అమ‌రావ‌తి: దేశంలోనే డర్టీ పొలిటీషియన్‌ చంద్రబాబు అంటూ మంత్రి ఆర్కే రోజా మండిప‌డ్డారు. బుధ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ..ప్రధాని మోదీ తల్లి, భార్యని తిట్టిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. ప్ర‌ధాని మోదీని తిట్టి మరీ నల్ల జెండాలు ఎగురవేశాడ‌న్నారు. మళ్ళీ మోదీ కాళ్ళు పట్టుకోవడానికి చంద్ర‌బాబు సిద్ధ‌ప‌డ‌టం సిగ్గు చేటు అన్నారు. మోదీ దేశంలో లేకుండా చేస్తానని చంద్రబాబు గతంలో అన్నాడు..అమిత్ షా పై తిరుమలలో చంద్రబాబు రాళ్లు వేయించాడ‌ని చెప్పారు. ఇప్పుడు అమిత్ షా కాళ్ళు పట్టుకుంటున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకోవడానికి లోకేష్ ని పంపాడని పేర్కొన్నారు.  ఇప్పుడు చంద్రబాబు తో కలిస్తే బీజేపీకే నష్టమే అని అభిప్రాయ‌ప‌డ్డారు. ఎన్ని పార్టీలు కలిసినా మళ్ళీ వైయ‌స్ జగన్  సీఎం అవుతార‌ని మంత్రి రోజా ధీమా వ్య‌క్తం చేశారు.

Best Web Hosting Provider In India 2024