Naa Sami Ranga OTT: నా సామిరంగ సినిమాపై అప్‍డేట్ ఇచ్చిన ఓటీటీ ప్లాట్‍ఫామ్

Best Web Hosting Provider In India 2024

Naa Sami Ranga on OTT: కింగ్ నాగార్జున హీరోగా నటించిన ‘నా సామిరంగ’ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్‍గా నిలిచింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన ఈ చిత్రం రిలీజ్ అయింది. ఇతర మూవీల నుంచి పోటీ ఎదురైనా.. అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్లను రాబట్టింది ఈ సినిమా. విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు దర్శకుడు విజయ్ బిన్నీ. ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

‘నా సామిరంగ’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఈ మూవీపై నేడు (ఫిబ్రవరి 8) అప్‍డేట్ ఇచ్చింది ఆ ప్లాట్‍ఫామ్. కింగ్ త్వరలోనే వస్తున్నాడు అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది.

“మీ స్క్రీన్‍లపై ఫైర్ అయ్యేందుకు కింగ్ వస్తున్నాడు. డేట్‍ను ఊహించగలరా” అంటూ డిస్నీ+ హాట్‍స్టార్ ట్వీట్ చేసింది. అయితే, త్వరలో అని అప్‍డేట్ ఇచ్చినా.. స్ట్రీమింగ్ డేట్‍ను వెల్లడించలేదు. చైన్ పట్టుకొని నాగార్జున నిలబడి ఉన్న పోస్టర్‌తో ఈ వీడియో ఉంది.

ఆరోజే రానుందా!

కాగా, నా సామిరంగ సినిమా ఫిబ్రవరి 15వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్‌లో స్ట్రీమింగ్‍కు వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ఫిబ్రవరి 15నే హాట్‍స్టార్ స్ట్రీమింగ్‍కు తీసుకొస్తుందేమో చూడాలి. మరో మూడు రోజుల్లోగా ఈ విషయంపై అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

1980ల బ్యాక్‍డ్రాప్‍లో నా సామిరంగ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు విజయ్ బిన్నీ. ఈ మూవీలో నాగార్జున మాస్ యాక్షన్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను అలరించాయి. పక్కా కమర్షియల్ మూవీగా పండుగకు సూటయ్యేలా ఈ చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున సరసన అషికా రంగనాథ్ హీరోయిన్‍గా నటించారు. యంగ్ హీరోలు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కూడా ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. నరేశ్‍కు జోడీగా మిర్నా మీనన్, రాజ్‍కు జోడీగా రుక్సాన్ ధిల్లాన్ నటించారు.

నా సామిరంగ సినిమా హిట్ కావడంతో సక్సెస్ సెలెబ్రేషన్లను కూడా మూవీ టీమ్ నిర్వహించుకుంది. ఈ మూవీ తన అభిమానులను విపరీతంగా నచ్చిందని నాగార్జున అన్నారు. ఇలాంటి చిత్రాలు కావాలని ఫ్యాన్స్ అడుగుతున్నారని చెప్పారు. అలాగే, వచ్చే సంక్రాంతికి కూడా తన మూవీ వస్తుందని ప్రకటించేశారు.

నా సామిరంగ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. కొరియోగ్రాఫర్‌గా ఫేమస్ అయిన విజయ్ బిన్నీ.. ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. మలయాళం మూవీ పొరింజు మరియం జోస్‍కు రీమేక్‍గా ఈ మూవీని తీసుకొచ్చారు. అయితే, తెలుగు తగ్గట్టుగా చాలా మార్పులు చేశారు. నా సామిరంగ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించారు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ హీరో ధనుష్ హీరోగా నటిస్తున్న చిత్రంలో నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటించనున్నారు. ఈ చిత్రం తర్వాత బంగార్రాజుకు సీక్వెల్ బంగార్రాజు 2 చిత్రాన్ని నాగార్జున చేస్తారనే రూమర్లు వస్తున్నాయి. 

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024