Best Web Hosting Provider In India 2024
Hyd Drugs: హైదరాబాద్ కొండాపూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న మారం పవన్ కుమార్ అలియాస్ మచ్చ పవన్ అతడి స్నేహితుడు ఆదర్శ్ కుమార్ సింగ్ నగరంలో డెలివరీ బాయ్స్ గా పని చేస్తున్నారు. దానితో వచ్చే ఆదాయం సరిపొకపోవడంతో డెలివరీ బాయ్స్ ముసుగులోనే వీరిద్దరూ కలిసి గత కొంతకాలంగా డ్రగ్స్ దందా చేస్తునట్టు డీసీపీ వెల్లడించారు.
ట్రెండింగ్ వార్తలు
వీరి గురించి అందిన సమాచారంతో నిందితుల కదలికలపై ఎస్ఓటి పోలీసులు, మాదాపూర్ పోలీసులు నిఘా పెట్టారని ఈ నేపథ్యంలోనే వారిని గురువారం అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
నిందితుల నుంచి రూ. 8 లక్షలు విలువైన 21.7 గ్రాముల ఎండిఎంఏ, 874 గ్రాముల గంజాయి, ఒక కారు, రెండు సెల్ ఫోన్లు, డిజిటల్ వెయింగ్ మిషన్లు స్వాధీనం చేసుకునట్లు తెలిపారు. డ్రగ్స్ కు బానిసైన పవన్,అరుణ్ కుమార్ సింగ్‌లు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఎండిఎంఏ డ్రగ్స్ ని బెంగళూరు నుంచి, గంజాయి ఒడిశా సరిహద్దు నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్ లో అధిక లాభాలకు విక్రయిస్తున్నారని డిసిపి వినీత్ వివరించారు.
ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు, కొనుగోలు చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే 942099100,949061744 నెంబర్లకు సమాచారం అందించాలని ఆయన సూచించారు.
గంజాయి ముఠా అరెస్ట్…
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులు ముఠాను గురువారం శంషాబాద్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 1.38 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.
ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ రావు తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు బుధవారం సాయంత్రం శాతం రాయి ధర్మకుంట సర్వీస్ రోడ్డుపై వాహనాల తనిఖీలు నిర్వహించారు.అదే సమయంలో ద్విచక్ర వాహనం పై వెళ్తున్న కాటేదాన్ ప్రాంతానికి చెందిన రాజు సింగ్ బైక్ ఆపి తనిఖీ చేయగా అతడి వద్ద 440 గ్రాములు గంజాయి లభించింది.
దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా….మరో ఇద్దరితో కలిసి ఈ దందా చేస్తున్నట్టు తెలిపాడు. అతడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రాజేంద్రనగర్‌లో ఉంటున్న వికాస్ కుమార్ నివాసంలో సోదాలు జరిపి మరో 940 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
బీహార్ కు చెందిన ఓ వ్యక్తి నుంచి కిలో గంజాయి రూ.10 వేలకు కొనుగోలు చేసి నగరంలో అవసరమైన వారికి రూ. 18 వేలకు విక్రయిస్తున్నట్లు నిందితులు తెలిపారు.
దొంగతనం కేసులో నిందితుడు అరెస్ట్…
దొంగతనం జరిగిన మూడు గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం గుర్తుతెలియని వ్యక్తి వెంకటాపురం జేజే నగర్ డివిజన్ లో ఓ మహిళా కంట్లో కారం చెల్లి ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెలు తాడుని దొంగలించాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు పట్టిన పోలీసులు….. సీసీ కెమెరాలు ఆధారంగా నిందితుడు ప్రేమ్ కుమార్ ను కేవలం 3 గంటల్లోనే గుర్తించి అరెస్ట్ చేశారు.
(కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా)
టాపిక్