Best Web Hosting Provider In India 2024
Telangana ECET 2024 Schedule: ఈ ఏడాదికి సంబంధించిన ప్రవేశాల పరీక్షలకు సంబంధించి ఇప్పటికే తేదీలను ప్రకటించింది తెలంగాణ ఉన్నత విద్యామండలి. ఇందులో భాగంగా తెలంగాణ ఈసెట్ -2024 షెడ్యూల్ ను వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం వివరాలను పేర్కొంది. బీటెక్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం నిర్వహించే ‘టీఎస్ ఈసెట్’ నోటిఫికేషన్ ఫిబ్రవరి 14వ తేదీన విడుదల కానున్నట్లు వెల్లడించింది. మే 6వ తేదీన ఈసెట్ ఎగ్జామ్ జరగనుంది. https://ecet.tsche.ac.in/ వెబ్ సైట్ లో వివరాలను చెక్ చేసుకోవచ్చు.
ట్రెండింగ్ వార్తలు
టీఎస్ ఈసెట్ షెడ్యూల్ – ముఖ్య తేదీలు
తెలంగాణ ఈసెట్ -2024 నోటిఫికేషన్ – ఫిబ్రవరి 14, 2024.
దరఖాస్తుల స్వీకరణ – ఫిబ్రవరి 15, 2024.
దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు – ఏప్రిల్ 16, 2024.
ఆలస్యం రుసుంతో – ఏప్రిల్ 28, 2024.
దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం – ఏప్రిల్ 24 నుంచి 28, 2024.
ఈసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ – మే 6, 2024.
టీఎస్ లాసెట్ షెడ్యూల్ 2024
TS Lawcet Schedule 2024: లాసెట్ – 2024 షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28 లా సెట్, పీజీ లా సెట్(ts lawcet 2024 exam date) నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి పేర్కొంది. మార్చి ఒకటవ తేదీ నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నట్లు ప్రకటించింది. జూన్ 3న ప్రవేశ పరీక్ష జరగనుంది.
తెలంగాణ లాసెట్ – 2024 నోటిఫికేషన్ – ఫిబ్రవరి 28, 2024.
దరఖాస్తుల స్వీకరణ – మార్చి 1, 2024.
దరఖాస్తులకు తుది గడువు – ఏప్రిల్ 15, 2024.
ఆలస్య రుసుంతో – 25.మే.2024
లాసెట్ ప్రవేశ పరీక్ష – జూన్ 3, 2024.
కోర్సులు – మూడు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులు, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సు.
అర్హతలు- మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యను పూర్తిచేసి ఉండాలి. ఎల్ఎల్ఎం చేయాలనుకునే వారు.. డిగ్రీతో పాటు ఎల్ఎల్ బీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు విధానం – ఆన్ లైన్
అధికారిక వెబ్ సైట్ – https://lawcet.tsche.ac.in/
ఈసెట్ ప్రవేశ పరీక్షను ఉస్మానియా వర్శిటీ, ఎంసెట్ పరీక్షలను జేఎన్టీయూ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి పేర్కొంది. ఎడ్ సెట్ ఎగ్జామ్ ను మహాత్మ గాంధీ వర్శిటీ, లాసెట్ – ఉస్మానియా వర్శిటీ, ఐసెట్ – కాకతీయ వర్శిటీ, పీజీఈసెట్ – జేఎన్టీయూ, టీఎస్ పీఈసెట్ ప్రవేశ పరీక్షను శాతవాహన వర్శిటీ నిర్వహించనుంది.
మిగతా ప్రవేశ పరీక్షల తేదీలివే:
-EAPCET(ఎంసెట్ ) – మే 9 నుంచి 13 వరకు.
-జూన్ 4,5 తేదీల్లో ఐసెట్.
-మే 23వ తేదీన ఎడ్‌సెట్.
తెలంగాణ పీజీఈసెట్ 6 జూన్, 2024 – 8, జూన్, 2024.
టాపిక్