Best Web Hosting Provider In India 2024
ఎండాకాలం వచ్చేస్తుంది.. ఫిబ్రవరి నెలలో వేడి ఇలా ఉంటే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.. శరీరాన్ని చల్లగా ఉంచే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అలాంటి ఆహారాల్లో ఒకటి చియా విత్తనాలు. ఈ చియా గింజలను జ్యూస్‌లో లేదా తాగే నీటిలో వేస్తే మంచిది. చియా గింజలను జ్యూస్ లేదా నీటిలో కలిపి రోజూ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు చూద్దాం..
ట్రెండింగ్ వార్తలు
చియా విత్తనాలలో పోషకాలు : కేలరీలు-138, ప్రోటీన్-4.7 గ్రా, కొవ్వు-8.7 గ్రా, పిండి పదార్థాలు-11.9 గ్రా, ఫైబర్-9.8 గ్రా, రోజుకు అవసరమైన కాల్షియంలో 14 శాతం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, విటమిన్ B1, విటమిన్ B3.
చియా సీడ్స్‌తో బరువు అదుపులో ఉంటుంది
చియా విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది. శరీరంలోని మలినాలను తొలగించడం ద్వారా శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి ఉపయోగపడుతుంది. చియా సీడ్స్ తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుకోవచ్చు. ఇది ఆకలి, దాహాన్ని ఎక్కువగా కలిగించదు. తద్వారా అతిగా తినడం అరికట్టవచ్చు. డైట్‌లో ఉన్నప్పుడు మిల్క్‌షేక్‌లో వేసుకుని తాగితే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.
మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది
చియా విత్తనాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇందులో ఫైబర్ కూడా దొరుకుతుంది. దీనిని తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం ఎముకలకు మంచిది.
ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయడంలో చాలా సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని నీటిలో వేసి సేవించడం మంచిది.
రోజుకు ఎంత చియా సీడ్స్ తినవచ్చు?
మీరు ఒక రోజులో 2-3 స్పూన్ల చియా విత్తనాలను ఉపయోగించవచ్చు. చియా సీడ్‌ను రోజూ తీసుకుంటే అది ఆరోగ్యానికి మంచిది, దాని వల్ల ఎటువంటి సమస్య ఉండదు. చియా విత్తనాలను నేరుగా తీసుకోవడం కంటే రసంలో తీసుకోవడం ఉత్తమం.
చియా విత్తనాలతో కలిగే దుష్ప్రభావాలు
చియా విత్తనాలను ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం, కడుపుబ్బరం సమస్యలు వస్తాయి. పేగు సమస్యలు వస్తాయి. చియా గింజలు మాత్రమే కాకుండా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినేటప్పుడు కూడా ఇలాంటి సమస్యలు వస్తాయని గుర్తుంచుకోవాలి. చియా గింజలకు అలెర్జీ వచ్చే అవకాశం చాలా అరుదుగా ఉన్నప్పటికీ, అది కూడా సాధ్యమే. మీకు అలెర్జీ ఉన్నట్లయితే దీనిని ఎక్కువగా తినవద్దు. ఈ గింజలను కొన్ని ఇతర ఆహార పదార్థాలతో కలపడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి. నారింజ, ఆవాలు, మెంతులతోపాటుగా కొన్ని ఇతర పదార్థాలతో కలిపి తినవద్దు. తక్కువ రక్తపోటు ఉన్నవారు దీనిని తీసుకోవడం ద్వారా వారి రక్తపోటు మరింత తగ్గవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి.