Thalakaya Kura curry: తలకాయ కూర ఇలా వండారంటే ఘుమఘుమలాడిపోతుంది, ఇదిగో సులువైన రెసిపి

Best Web Hosting Provider In India 2024

Thalakaya Kura curry: నాన్ వెజ్ ప్రియులకు తలకాయ కూర గుర్తొస్తే నోట్లో నీళ్లూరిపోవడం ఖాయం. దీన్ని అన్నంలో తిన్నా, చపాతీతో తిన్నా, రాగిసంగటితో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. తలకాయ కూరను టేస్టీగా వండే వారి సంఖ్య తక్కువే. నిజానికి తలకాయ కూరను సరైన పద్ధతిలో వండితే ఆ కూరకు ఇంకేది సాటి రాదు. తలకాయ కూర సులువుగా టేస్టీగా ఎలా వండాలో ఇక్కడ మేము చెబుతున్నాం. ఒకసారి ఈ రెసిపీ ఫాలో అయిపోండి.

ట్రెండింగ్ వార్తలు

తలకాయ కూర రెసిపీకి కావలసిన పదార్థాలు

తలకాయ కూర – కిలో

నూనె – తగినంత

ఉల్లిపాయలు – నాలుగు

ఎండు కొబ్బరి తరుగు – మూడు స్పూన్లు

పసుపు – పావు స్పూను

నీళ్లు – తగినంత

బిర్యాని ఆకు – ఒకటి

పచ్చిమిర్చి – మూడు

కారం – నాలుగు స్పూన్లు

అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను

ఉప్పు – రుచికి సరిపడా

కొత్తిమీర తరుగు – మూడు స్పూన్లు

ధనియాలు – ఒక స్పూను

లవంగాలు – ఐదు

జాపత్రి – కొద్దిగా

అనాసపువ్వు – ఒకటి

దాల్చిన చెక్క – చిన్న ముక్క

తలకాయ కూర రెసిపీ

1. తలకాయ కూరను ఒక గిన్నెలో వేసి ఉప్పు, పసుపు వేసి పావుగంట పాటు అలా ఉంచండి.

2. తర్వాత శుభ్రంగా కడిగి కుక్కర్లో వేయండి. నీళ్లు, ఒక స్పూన్ నూనె, పసుపు వేసి బాగా కలిపి ఉడికించండి.

4. అయిదు విజిల్స్ వచ్చేదాకా ఉంచి తర్వాత స్టవ్ కట్టేయండి.

5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాసపువ్వు వేసి వేయించండి.

6. వాటిని మిక్సీలో వేసి పొడిలా చేసి పక్కన పెట్టుకోండి.

7. ఇప్పుడు ఉల్లిపాయలను పైన పొట్టు తీసేసి నాలుగు వైపులా గాట్లు పెట్టుకోండి. స్టవ్ మీద పెట్టి చిన్న మంటపై కాల్చుకోండి.

8. వాటిని చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేయండి.

9. అలాగే ఎండు కొబ్బరి తరుగును వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని తీసి పక్కన పెట్టుకోండి.

10. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి. అందులో బిర్యానీ ఆకు వేసి వేయించండి.

11. నిలువుగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసి వేయించండి.

12. ఇప్పుడు పేస్టులా చేసుకున్న ఉల్లిపాయ, కొబ్బరి తరుగును వేసి బాగా వేయించండి.

13. ఉల్లిపాయ పచ్చి వాసన పోయేదాకా వేయించాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి.

14. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న తలకాయ కూర వేసి బాగా కలపండి.

15. మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించండి.

16. తర్వాత మూత తీసి కారం, ఉప్పు, పసుపు ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి బాగా కలుపుకోండి.

17. కళాయి మీద మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించండి. తర్వాత నీళ్లు పోసి బాగా కలుపుకోండి.

18. ఇప్పుడు మూత పెట్టి 20 నిమిషాల పాటు ఉడికించండి.

19. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. కూర చిక్కగా అయ్యేదాకా అలా ఉడికించండి.

20. కూర కాస్త చిక్కగా అయ్యాక పైన కొత్తిమీర జల్లుకొని స్టవ్ కట్టేయండి.

21. అంతే తలకాయ కూర రెడీ అయినట్టే. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు.

22. ఈ తలకాయ కూర గ్రేవీని చపాతీతో తిన్నా, అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.

మటన్, చికెన్ కన్నా తలకాయ కూరకు అభిమానులు ఎక్కువ. దీని ఇగురు లేదా పులుసు.. ఒక ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. అందుకే దావత్ లైతే తలకాయ కూర కోసం ఎదురు చూసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. దీన్ని ఒకసారి మీరు వండుకొని చూడండి. తర్వాత మీరే ఇష్టంగా వండుకుంటారు. తలకాయ కూర తినడం వల్ల ఎన్నో పోషకాలు శరీరంలో చేరుతాయి.

WhatsApp channel

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024