పవన్‌ పార్టీ పెట్టింది ఆశతోనా..? ఆశయంతోనా..?

Best Web Hosting Provider In India 2024

ప్రశ్నిస్తానని చెప్పి.. ప్రజలతో ప్రశ్నించుకునే స్థాయికి దిగజారాడు

బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

తూర్పుగోదావరి: సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో పేదరికం తగ్గిందని, సంక్షేమ పథకాలతో నిరుపేదలు సంతోషంగా జీవిస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. అర్హులైన వారందరికీ గడప ముందుకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ అఖండ విజయం సాధించి మళ్లీ జననేత వైయస్‌ జగనే ముఖ్యమంత్రి అవుతారన్నారు. మంత్రి చెల్లుబోయిన మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ ఆశతో పార్టీ పెట్టారా..? ఆశయంతో పార్టీ పెట్టారా..? అని నిలదీశారు. ఓ వైపు బీజేపీ పొత్తు అంటాడు.. మరోవైపు టీడీపీతో కలిసి తిరుగుతున్నాడు.. పవన్‌ పెట్టిన పార్టీలో ఆశయం ఎక్కడా కనిపించడం లేదన్నారు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్‌.. ప్రజలతో ప్రశ్నించుకునే స్థాయికి దిగజారిపోయాడన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా వైయస్‌ జగన్‌ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. 
 

Best Web Hosting Provider In India 2024