Diabetes: డయాబెటిక్ పేషెంట్లు ప్రతిరోజూ తినాల్సిన ఐదు రకాల చిరుధాన్యాలు ఇవే

Best Web Hosting Provider In India 2024

Diabetes: పూర్వం సజ్జలు, జొన్నలు… వంటి చిరుధాన్యాలనే తినేవారు. ఎప్పుడైతే తెల్ల బియ్యం ప్రాచుర్యంలోకి వచ్చాయో. అప్పటినుంచి చిరుధాన్యాలను తినేవారి సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆరోగ్యం, ఫిట్నెస్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యల బారిన పడుతున్న వారి సంఖ్య పెరగడంతో చిరుధాన్యాలను తినేవారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. డయాబెటిస్ పేషెంట్లు ముఖ్యంగా ఐదు రకాల చిరుధాన్యాలను తినడం అలవాటు చేసుకోవాలి. వాటి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండి డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

మిల్లెట్లు ఉపయోగాలు

చిరుధాన్యాలను మిల్లెట్లు అంటారు. ఇవి చిన్న విత్తనాలు కలిగిన ధాన్యాలు. వీటిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. సహజంగా ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖినిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇవి గ్లూటెన్ రహిత ధాన్యాలు. తక్కువ గ్లైసేమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. కాబట్టి తిన్న తర్వాత ఇవి నెమ్మదిగా జీర్ణం అవుతాయి. కాబట్టి రక్తంలో ఒకేసారి గ్లూకోజ్ విడుదల జరగదు. కాబట్టి రక్తంలో చక్కర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంటాయి. అలాగే వీటిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి జీర్ణ క్రియ సవ్యంగా సాగుతుంది. కార్బోహైడ్రేట్లను శరీరం శోషించుకోవడం కూడా నెమ్మదిగా జరుగుతుంది. దీని వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. డయాబెటిస్ పేషెంట్లు రెగ్యులర్‌గా తమ డైట్ లో చేర్చుకోవాల్సిన చిరుధాన్యాలు ఉన్నాయి. వీటిని వారంలో కనీసం ఒకటి రెండు సార్లు తినడం చాలా అవసరం.

రాగులు

వీటిని ఫింగర్ మిల్లెట్స్ అంటారు. ఇవి గ్లూటెన్ రహిత చిరుధాన్యాలు. ఫైబర్ అధికంగా ఉంటుంది. పాలిఫెనాల్ కంటెంట్ కూడా ఎక్కువే. కాబట్టి మధుమేహ రోగులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనివ్వదు. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. ఈ రాగి పిండితో రోటీలు, దోశెలు, గంజి, కుకీలు, పాన్ కేకులు వంటివి చేసుకొని తినవచ్చు.

సామలు

వీటిని లిటిల్ మిల్లెట్స్ అని కూడా పిలుస్తారు. వీటిలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. డయాబెటిస్ పేషెంట్లకు ఇది ఉత్తమ ఆహారమని చెప్పుకోవచ్చు. అలాగే ఐరన్, బి విటమిన్లు కూడా దీనిలో ఉంటాయి. కాబట్టి శరీరంలో రక్తహీనత సమస్య రాదు. వీటితో అన్నం వండుకొని తినవచ్చు.

సజ్జలు

వీటిని పెర్ల్ మిల్లెట్ అంటారు.దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. ఫైబర్ కంటెంట్ ఎక్కువ. ఇది తింటే నిరంతరం శక్తి అందుతూనే ఉంటుంది. దీన్ని పిండిలా మార్చుకొని రోటీలు చేసుకోవచ్చు. లేదా జావలా కాచుకొని తాగవచ్చు.

కొర్రలు

ఆంగ్లంలో ఫాక్స్ టైల్ మిల్లెట్స్ అంటారు. వీటిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. రక్త ప్రవాహంలో గ్లూకోజ్ త్వరగా కలవకుండా అడ్డుకుంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. డయాబెటిస్ ఉన్న వ్యక్తులకు ఇది ఉత్తమ భోజనంగా చెప్పుకోవచ్చు. సలాడ్లు, సూపులలో భాగం చేసుకోవచ్చు. అలాగే అన్నంగా కూడా వండుకోవచ్చు.

ఊదలు

వీటిని బార్న్యార్డ్ మిల్లెట్ అని పిలుస్తారు. మధుమేహులకు ఇది ఉత్తమ ఆహారం. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన చిరుధాన్యం. దీనిలో మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఫైబర్ అధికంగా ఉంటాయి. దీంతో గంజి కాచుకొని తాగితే ఎంతో మంచిది. అలాగే కప్ కేకులు, బ్రెడ్ వంటివి చేసుకోవచ్చు.

WhatsApp channel

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024