YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.23-11-2022(బుధవారం) ..
నవ నందిగామ పై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు , ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
నందిగామలో మూడేళ్లలో మేము చేసిన అభివృద్ధిపై – మా పనితీరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ప్రజల ఆలోచనలు ,ఆకాంక్షలు అనుగుణంగా పనిచేస్తున్నాం : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రాజకీయాలకు అతీతంగా పట్టణ ప్రముఖులతో – సీనియర్ సిటిజన్స్ తో – పలు రంగాల ప్రముఖులతో అభివృద్ధి పై చర్చించడం – సలహాలు ,సూచనలు అడగడం అభినందనీయం ..
మా పనితీరును- పరిపాలనను -అభివృద్ధిని ప్రముఖులంతా స్వాగతించి -ఆమోదించారు : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ పట్టణంలోని గాంధీ సెంటర్ లో నవనందిగామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో నందిగామ పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు ,మేధావులు , విద్యావేత్తలు పాల్గొని నందిగామ అభివృద్ధిపై వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ – పలు సలహాలు సూచనలు ఇచ్చారు .. రాజకీయాలకు అతీతంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు , శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు పాల్గొన్నారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందిగామ ప్రజల ఆశీస్సులతో – వారి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని ,మా మూడేళ్ల పాలనలో గర్వంగా చెప్పుకోదగ్గ విధంగా పరిపాలన చేశామని , మా పనితీరుపై మేము సాధించిన ప్రగతి పై సలహాలు -సూచనలు -విమర్శలు తెలుసుకునే విధంగా రాజకీయాలకు అతీతంగా పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు -వివిధ రంగాల మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి వారి వారి అభిప్రాయాలను తెలుసుకున్నామన్నారు , వారందరి అభిప్రాయాలు విన్న తర్వాత ఈ మూడేళ్ల కాలంలో మా పనితీరు -మేము చేసిన అభివృద్ధి ప్రజల ఆకాంక్షలు ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయని స్పష్టమైనదని తెలిపారు ,ఉదాహరణకు సీఎం రోడ్డు విస్తరణలో మాపై ఎన్నో విమర్శలు -దుష్ప్రచారాలు – నిందలు మోపారని కానీ చివరికి ఆనాడు అడ్డుకున్న వారే నేడు ప్రశంసిస్తున్నారని , ఆనాడు విమర్శించిన వారే -వారు చేసిన పొరపాటు గ్రహించి ప్రజలందరికీ ముందు మా నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ..
ఈ మూడేళ్లలోనే పట్టణ పరిధిలో ఇంటింటికి తాగు నీటి కుళాయి పథకం ,కేంద్రీయ విద్యాలయం ,రెండు అర్బన్ హెల్త్ సెంటర్లు , ఓపెన్ జిమ్ ,రెండు గార్బేజ్ స్టేషన్ల నిర్మాణం ,వైయస్సార్ రైతు బజార్ అండ్ ఫ్రూట్ మార్కెట్ ,కోవిడ్ హాస్పిటల్ – ఆక్సిజన్ ప్రొడక్షన్ మిషనరీ , రూ.15 కోట్లతో డ్రైనేజీల నిర్మాణం , శివాలయానికి రు.కోటి రూపాయలు అభివృద్ధి పనులు ,పట్టణంలో నాడు -నేడు కింద 9 పాఠశాలల అభివృద్ధి ,అనాసాగరంలో వాటర్ పంపింగ్ స్కీం , పాత మునేరు -కొత్త మునేరులో కొత్త మోటార్లు ,జనరేటర్లు ఏర్పాటు ,సీఎం రోడ్డు విస్తరణ , గాంధీ జంక్షన్ అభివృద్ధి లాంటి ఎన్నో గర్వించదగ్గ పనులు చేపట్టామని నందిగామను మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం అభివృద్ధి పనులకు అడ్డుపడటం మంచి పద్ధతి కాదన్నారు , రాజకీయాలను రాజకీయం కాని ఎదుర్కోవాలని – ప్రజలకు -పట్టణానికి జరుగుతున్న మేలును అడ్డుకోవడం సమంజసం కాదన్నారు ..
ఈ సమావేశంలో విద్యాసంస్థల అధినేతలు కాపా రవీంద్రబాబు – అమరనేని రమేష్ బాబు – ఆళ్ళ రాంబాబు లు మాట్లాడుతూ గతంలో ఏ పాలకులు కూడా ఈ విధంగా పట్టణంలో ప్రముఖులను పిలిచి జరుగుతున్న అభివృద్ధిపై అభిప్రాయాలను సేకరించలేదని – అభివృద్ధిలో పరిపాలనలో ప్రజలను భాగస్వామ్యం చేయడం అభినందనీయమని అటువంటి గొప్ప సంకల్పానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారి సోదరులు ఆదర్శప్రాయులని కొనియాడారు , అదేవిధంగా నగరికరణకు – పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని నేడు రోడ్ల విస్తీర్ణం అనేది అనివార్యమైందని ,తప్పకుండా పట్టణంలోని ప్రధాన రహదారులను విస్తరించాల్సిన అవసరం ఉందని , విస్తీర్ణంలో కొంతమందికి నష్టం జరగడం సాధారణ విషయమైనప్పటికీ విస్తీర్ణం అనంతరం ప్రజలకు పట్టణానికి మేలు జరుగుతుందని తెలిపారు , ఎమ్మెల్యే సోదరులు చేపట్టిన అభివృద్ధి పనులకు మా వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని చెప్పారు ..
ఈ సమావేశంలో పట్టణ ప్రముఖులు మన్నెం నారాయణరావు ,ఈశ్వరప్రగడ జగన్నాథరావు , రిటైర్డ్ ఎంఈఓ కుమార్ , గోపు పూర్ణ లు మాట్లాడుతూ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియని , ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి చేశారో , ఎవరి హయాంలో పట్టణ రూపురేఖలు మారుతాయో వారికి ప్రజల మద్దతు ఉంటుందని ,ప్రజలకు చేయాల్సిన మంచిపై అభిప్రాయాలు సేకరించటం , విమర్శలను సైతం బహిరంగ చెప్పమని ఎమ్మెల్యే సోదరులు చెప్పటం అభినందనీయమని ,వారు నందిగామ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి – ప్రధాన రోడ్లను విస్తరించి ఆయా కూడళ్ళలో – డివైడర్ల మధ్యలో కూడా ప్రముఖుల విగ్రహాలను పెట్టాలని సూచించారు ..
ఈ సమావేశంలో విద్యావేత్తలు జీడిఎంఎం ప్రసాద్ , ప్రతిభా ఖాసిం ,దీక్ష హనిఫ్ , సమాచార హక్కు చట్టం హనుమంతురాలు మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు , ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు నందిగామలో ఇండోర్ స్టేడియం ,కళావేదిక , పార్కు వంటి వాటిని కూడా ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేయాలని సూచించారు , దీనిపై స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు వీటిపై గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని , నిధుల మంజూరుకు కృషి చేస్తున్నామని , రానున్న రెండేళ్లలో వాటిని కూడా నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు ..
ఈ సమావేశంలో పట్టణ ప్రముఖులు బొబ్బెళ్ళపాటి సాయి ,పారేపల్లి సాయి ,గంట విజయ్ కుమార్, నకరికంటే విశ్వేశ్వరరావు , కోట దేవదాస్ ,రామిరెడ్డి శ్రీధర్ లు మాట్లాడుతూ పట్టణంలో ప్రధానంగా ఉన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని , సీఎం రోడ్డులో ర్యాష్ డ్రైవింగ్ జరగకుండా కానిస్టేబుల్ లను ఏర్పాటు చేయాలని , ప్రధాన కూడళ్ళలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని ,రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలని , అడవిరావులపాడు ,చందాపురం గ్రామాల ముందున్న కాజ్ వే లపై అప్పుడప్పుడు వరద నీరు ప్రవహిస్తుందని రాకపోకలకు అడ్డంగా మారిందని దానిని కూడా పరిష్కరించే విధంగా ఆలోచన చేయాలని సూచించారు .. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు నందిగామలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి కి నివేదిక ఇచ్చామని , చందాపురం అడవిరావులపాడు కాజ్ వే ల స్థానంలో బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామని తెలిపారు ..
అనంతరం రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన మేధావులను ప్రముఖులను ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు శాలువాలతో సత్కరించారు , పట్టణ అభివృద్ధి రాజకీయ పార్టీలదే కాదని , పట్టణంలోని ప్రతి పౌరుడికి సంబంధించిన విషయమని – ఇది అందరి బాధ్యతని ,మా పని తీరుకు -అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నట్టు తెలిపారు ..
ఈ కార్యక్రమంలో నవనందిగామ అభివృద్ధి కమిటీ షేక్ కరీం ను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రత్యేకంగా అభినందించారు , నవనందిగామ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు , ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు మండవ పిచ్చయ్య , ఆడిటర్ శాస్త్రి ,సజ్జనరావు , పెసరమల్లి శేఖర్ , పలువురు మీడియా మిత్రులు ,విద్యార్థులు పాల్గొన్నారు ..