Egg 65 Recipe : ఇంట్లోనే టేస్టీ.. టేస్టీ ఎగ్ 65 తయారు చేసుకోవచ్చు

Best Web Hosting Provider In India 2024

గుడ్డుతో చాలా రకాల వంటకాలు చేసుకోవచ్చు. ఆమ్లెట్ వేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. అయితే ఎప్పుడైనా ఎగ్ 65 ట్రై చేశారా? చాలా రుచికరంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రొటీన్లు లభించే ఏకైక మూలం గుడ్లు. రోజుకు రెండు ఉడకబెట్టిన గుడ్లు తినడం ఆరోగ్యానికి ఉపయోగకరం.

ట్రెండింగ్ వార్తలు

గుడ్లలో ప్రోటీన్ రిబోఫ్లేవిన్, ఫోలేట్, ఐరన్, ఫాస్పరస్, సెలీనియం, మెగ్నీషియం, విటమిన్లు ఎ, ఇ, B6, విటమిన్ డి, ఎముకల ఆరోగ్యానికి కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. దీన్ని రోజూ తినడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలు దొరుకుతాయి. ఎముకల దృఢత్వాన్ని పెంచుతాయి. చాలా మంది ఇంట్లో ఎగ్స్ ఉంటే.. వాటిని పగలగొట్టి ఆమ్లెట్ వేసుకుంటారు. ఉల్లిపాయలతో కలిపి పులుసు పెట్టుకుంటారు. అయితే కొత్తగా ఎగ్ 65 ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది.

ఎగ్ 65కి కావాల్సిన పదార్థాలు

గుడ్లు – 5, తరిగిన అల్లం – 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి – 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి – 2, శెనగ పిండి – 5 లేదా 6 టేబుల్ స్పూన్లు, పసుపు పొడి – చిటికెడు, రెడ్ చిల్లీ పౌడర్ – 1/2 tsp, కాశ్మీరీ చిల్లీ పౌడర్ – 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి – 1/2 tsp, గరం మసాలా పొడి – 1 టేబుల్ స్పూన్, ఉప్పు – రుచి ప్రకారం. పేస్ట్ చేయడానికి : నూనె – 1.5 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి – 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి- 4, కరివేపాకు – 3 కట్టలు, రెడ్ చిల్లీ పౌడర్ – 1/2 tsp, టొమాటో కెచప్ – 3 టేబుల్ స్పూన్లు,

ఎగ్ 65 తయారీ విధానం

ముందుగా గుడ్లను నీటిలో ఉడకబెట్టి పెంకును తీసి గుడ్డులోని తెల్ల భాగాన్ని వేరుగా ఉంచాలి.

తర్వాత గుడ్డును ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేయాలి.

ఇప్పుడు శెనగ పిండి, పసుపు పొడి, కాశ్మీరీ కారం, గరం మసాలా, రుచికి తగినట్లుగా ఉప్పు వేయాలి. దానికి పచ్చి గుడ్డు పగలగొట్టి బాగా కలపాలి.

తర్వాత పొయ్యి మీద పాన్‌ పెట్టి గుడ్డు మిశ్రమాన్ని డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసి వేడి చేయాలి.

నూనె వేడిగా ఉన్నప్పుడు ముందుగా ఉడికించి మిశ్రమాన్ని కలిపిన గుడ్డును వేయండి. వాటిని బంగారు గోధుమ రంగు వచ్చేవరకు మీడియం మంట మీద 3-4 నిమిషాలు వేయించాలి.

ఇప్పుడు ఓవెన్‌లో బాణలి పెట్టి కొంచెం నూనె పోసి వేడయ్యాక అందులో సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు వేసి ఎక్కువ మంట మీద వేయించాలి.

ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు బాగా వేయించాలి. తర్వాత వేయించిన గుడ్లు వేసి మీడియం మంటలో సుమారు 30 సెకన్ల పాటు కదిలించండి.

తర్వాత ఎర్ర మిరప పొడి, టొమాటో కెచప్‌ను నీటితో కలిపి సుమారు 1-2 నిమిషాలు మీడియం వేడిలో బాగా వేయించాలి. ఇలా చేస్తే ఎగ్ 65 రుచికి రెడీ అయినట్టే.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024