Best Web Hosting Provider In India 2024
Chelsea in SSMB29: ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా లెవల్లో ఎంతో ఆసక్తి రేపుతున్న మహేష్ బాబు, రాజమౌళి సినిమా ఎస్ఎస్ఎంబీ29లో ఓ ఇండోనేషియా నటి నటించబోతుందన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. నిజానికి చాలా రోజులుగా ఈ వార్తలు వస్తున్నా.. తాజాగా చెల్సీ అనే ఆ నటి ఇన్‌స్టాగ్రామ్ లో రాజమౌళిని ఫాలో అవుతుండటం వీటికి మరింత ఊతమిస్తున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
ఎస్ఎస్ఎంబీలో చెల్సీ
అమెరికాలో పుట్టిన ఇండోనేషియా నటి చెల్సీకి ఇన్‌స్టాగ్రామ్ లో 16 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఆమె కూడా సుమారు 5700 మందిని ఫాలో అవుతోంది. అందులో మన దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఒకరు కావడం విశేషం. దీంతో ఎస్ఎస్ఎంబీ29లో చెల్సీ ఓ కీలకపాత్ర పోషించబోతోందన్న వార్తలు నిజమేనేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
గత జనవరిలోనే చెల్సీ ఈ మూవీలో నటించనుందని, అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక సమాచారం ఏదీ లేదని 123తెలుగు రిపోర్ట్ చేసింది. అయితే ఆదివారం (ఫిబ్రవరి 11) ఓ రెడిట్ యూజర్ ఈ విషయాన్ని బయటపెట్టారు. చెల్సీ ఇన్‌స్టాలో రాజమౌళిని ఫాలో అవుతోంది చూశారా అంటూ ఆ స్క్రీన్‌షాట్ ను పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది.
“ఎస్ఎస్ఎంబీ29లో ఇండోనేషియన్ నటి చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ నటించబోతోందన్న వార్తలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. ఆమె తాజాగా ఇన్‌స్టాలో ఎస్ఎస్ఆర్ ను ఫాలో అవుతోంది” అని సదరు రెడిట్ యూజర్ రాశారు. ఎస్ఎస్ఎంబీ29లో మహేష్ తప్ప ఇప్పటి వరకూ ఏ ఇతర నటీనటుల గురించి ఎలాంటి సమాచారం లేదు. అయితే ఇప్పుడు చెల్సీ అనధికారికంగా ఖరారైనట్లు తెలుస్తోంది.
ఎవరీ చెల్సీ ఎలిజబెత్?
చెల్సీ ఎలిజబెత్ అమెరికాలో పుట్టిన నటి. ఆమె తల్లి ఇండోనేషియన్ కాగా.. తండ్రి అమెరికాకు చెందిన వాడు. న్యూయార్క్ లోని క్వీన్స్ లో ఆమె జన్మించింది. కానీ తన స్కూలింగ్ మాత్రం ఇండోనేషియాలోనే జరిగింది. 2013లో రిఫ్రెయిన్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై అరంగేట్రం చేసింది.
అయితే 2014 నుంచి 2017 వరకూ వచ్చిన సిరీస్ టెటంగా మాసా గిటు అనే సిరీస్ తో పాపులర్ అయింది. చివరిసారి 2020లో డెవిల్ టేక్ యూ టూ అనే సినిమాలో ఆమె కనిపించింది. ఇప్పటి వరకూ చెల్సీ కేవలం ఇండోనేషియన్ మూవీస్ లోనే నటించింది. అలాంటి నటిని రాజమౌళిని ఎందుకు ఎంచుకున్నాడన్నది ఆసక్తికరమే.
ఎస్ఎస్ఎంబీ 29 షూటింగ్ ఎప్పుడు?
రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న ఈ ఎస్ఎస్ఎంబీ29 మూవీకి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఈ మధ్యే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం ఈ మూవీ కథ రాయడం పూర్తయిందని వెల్లడించారు.
దీంతో వచ్చే సమ్మర్ లోనే షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేమ్స్ బాండ్, ఇండియానా జోన్స్ లాంటి స్టోరీతో ఈ మూవీ తెరకెక్కబోతోందని కూడా విజయేంద్ర ప్రసాద్ గతంలో చెప్పారు. మూవీ ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చాయి.
టాపిక్