నివాసం పక్క రాష్ట్రంలో… అధికారం మాత్రం ఇక్కడ కావాలా బాబూ?

Best Web Hosting Provider In India 2024

చంద్రబాబు, లోకేష్ లను జనం పట్టించుకోరు-వాళ్ళు ప్రజల్లో లేరు

మీ నాన్న పాలనలో జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీ చేసింది నిజం కాదా లోకేష్?

ఏపీలో సంక్షేమం, అభివృద్ధిని చూసి ఎవరైనా మాట్లాడండి 

 ప్ర‌తిప‌క్షాల‌కు రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన హిత‌వు

శ్రీ‌కాకుళం:  అభివృద్ధి చూసి మాట్లాడాల‌ని ప్రతిపక్ష నాయ‌కుల‌కు రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు హిత‌వు ప‌లికారు. ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళని..క‌ళ్లు ఉన్నా చూడ‌లేని వాళ్ళని, చెవులు ఉండి వినలేని వాళ్ళని, నిద్ర న‌టించే వాళ్ల‌ను ఏం అన‌గలం అని అన్నారు. ఇవాళ రాష్ట్రం కోసం మాట్లాడుతున్న విప‌క్ష నేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో (పక్క రాష్ట్రంలో) ఉంటున్నారు. ఆయన వ్యాపారాలన్నీ పక్క రాష్ట్రంలో ఉంటే అద‌నంగా ఇక్క‌డ సీఎం ప‌ద‌వి కావాల‌ని కోరుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రయోజ‌నాల కోసం మాట్లాడ‌డం విడ్డూరంగా ఉంది. ఇవాళ మ‌న రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి అంట ! టీడీపీ యువ నాయ‌కుడు లోకేశ్ చెబుతున్నారు. ప‌థ‌కాల అమలులో భాగంగా గ్రామాల్లో ఏనాడైనా వర్గాలు చూశామా ? పార్టీ చూశామా ? ప్రభుత్వం అదించే పథకాల‌కు అర్హులా ? కాదా ? అన్న‌దే చూశాం. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ఎందుకు 

ఈ మాట చెప్పలేకపోయారు. చెప్పు లోకేశ్..?
ఆ రోజు టీడీపీ హ‌యాంలో జన్మభూమి కార్య‌క‌ర్త‌లు దోచుకున్నారు. ప‌థ‌కాల వ‌ర్తింపు కోసం ప్ర‌జ‌లు అర్జీలు పెట్టుకుంటే కలెక్టర్లు సైతం జన్మ భూమి కమిటీ సభ్యులను కలవమని చెప్పేవాళ్ళు. ప్రజాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో రాజ్యాంగం ఇచ్చిన హ‌క్కు ప్ర‌కారం ఓటు వేసి అధికారంలోకి వచ్చి చంద్రబాబు చేసిన పని ఏముంద‌ని ? ఇవాళ వివక్ష,కక్ష సాధింపు అన్న‌వి ఉన్నాయ‌ని అంటున్నారు లోకేశ్. గ్రామాలకు వచ్చి చూస్తే తెలుస్తుంది వాస్త‌వాలేంట‌న్న‌ది. ప్రజలకు లోకేశ్,చంద్రబాబు ఎప్పుడో దూరం అయిపోయారు. కేవలం ఏబీఎన్,ఈనాడు,టీవీ5 మీడియాలతో మాత్రమే వారిద్ద‌రూ బతుకుతున్నారు. విద్యా వ్య‌వ‌స్థ నాశనం అయిపోయింది అని అంటున్నారు. ఇవాళ విద్యావ్య‌వ‌స్థ‌లో ఎన్నో మార్పులు తీసుకు వచ్చి,ఇంట‌ర్నేష‌న‌ల్ సిల‌బ‌స్ తీసుకు వచ్చి పాఠాలు చెప్పిస్తున్నాం. కానీ వాస్త‌వాలు గుర్తించ‌కుండా ఆ ఇద్ద‌రూ (చంద్ర‌బాబు,లోకేశ్) అబ‌ద్ధాలు,అన్యాయాలతో ప్ర‌జ‌ల ముందుకు వెళ్తున్నారు.”  

కొంత‌మంది సినీ యాక్ట‌ర్లు వ‌స్తుంటారు. వాళ్లంతా అప్పుడ‌ప్పుడూ క‌నిపిస్తూ ఉంటారు. వాళ్లే వ‌లంటీర్లు వద్దు అని అంటున్నారు. వ‌లంటీర్లు ప్రజలకు చేస్తున్న సేవ ఏంట‌న్న‌ది ప‌క్క రాష్ట్రంలో ఉన్నవారికి ఏం అర్థం అవుతుంది ? ఈ రోజు ఇంతమంది సంతోషంగా ఉంటున్నారు అంటే దానికి కారణం జగన్ ప్రభుత్వం కాదా..అంద‌రి క్షేమం కోరుకున్నది,అందుకు త‌గ్గ విధంగా పాల‌న చేస్తున్న ది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా.. టీవీల‌లో,పత్రికల్లో ఈ ప్రభుత్వం పై కొంద‌రు చేస్తున్న అసత్య ప్రచారాలను అందరూ తిప్పి కొట్టాలి. మాట్లాడితే చాలు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి డ‌బ్బులు పంచేస్తున్నారు.. పంచేస్తున్నారు..అంటున్నారే కానీ  ఆయ‌న‌ను ఉద్దేశించి..తినేస్తున్నారు..తినేస్తున్నారు అని అన‌డం లేదు ఎందుకు..?  

ఈ ఐదేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు శ్రీ‌కాకుళం జిల్లాలో చేపట్టాం. చంద్రబాబు ఇంతకు ముందు ఐదేళ్ల‌లో ఏం చేశారో చెప్పగలరా..? కిడ్నీ బాధితుల కోసం 200 కోట్ల రూపాయ‌ల‌తో డయాలసిస్ సెంటర్ ను పలాసలో నిర్మించాం. ఉద్దాన ప్రాంతానికి రక్షిత మంచి నీటి ప‌థ‌కం 700 కోట్ల రూపాయ‌లతో అందించాం. అలానే 4 వేల కోట్ల రూపాయ‌ల‌తో చేప‌డుతున్న మూలపేట పోర్టు నిర్మాణపు ప‌నుల‌ను త్వరలో పూర్తి చేస్తాం. బుడగుట్ల పాలెంలో 350 కోట్ల రూపాయ‌లతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శ్రీ‌కారం దిద్దాం. ఇవ‌న్నీ ఐదేళ్ల‌లో మేం చేశాం. విప‌క్ష నేత చంద్రబాబు కానీ,ఆయ‌న కుమారుడు లోకేశ్ కానీ వారి హ‌యాంలో ఏం చేశారో చెప్పగలరా.?

 2.5 లక్షల శాశ్వత ఉద్యోగాలు గ్రామ వార్డు సచివాలయంలో ఇచ్చాం. 56 వేల ఉద్యోగాల‌ను వైద్య ఆరోగ్య శాఖలో భ‌ర్తీ చేశాం. వీటి విష‌య‌మై ఎవ్వరైనా,ఎక్కడైనా లంచం ఇచ్చారా..? ప‌థ‌కాల అమ‌లు కోసం లేదా ఇత‌ర అభివృద్ధి ప‌నుల కోసం అప్పులు చేస్తున్నాం అంటున్నారు. గత ప్రభుత్వం కన్నా తక్కువ అప్పులు చేశాం. వారు దోచుకు తింటే.. ఈ ప్రభుత్వం హ‌యాం లో ప్రజల ఖాతాల్లోకి న‌గ‌దు వేసి ఆ కుటుంబం బాగుండాలి అని భావించాం. గత పాలకులు రాష్ట్ర ఖ‌జానాను లూటీ చేశారు.

 వంశధార ప్రాజెక్ట్ కోసం..ఒడిశాతో ఉన్న వివాదం నేపథ్యంలో పరిష్కారం కోసం సీఎం జగన్ చొర‌వ చూపారు. ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ ను  కలిశారు. నేర‌డి బ్యారేజీ విష‌య‌మై చర్చ‌లు చేప‌ట్టారు. అయిన కూడా ఆ వివాదం ఓ కొలిక్కి రాకపోవడంతో గొట్టా దగ్గర లిఫ్ట్ పెట్టి ప్రాజెక్ట్ ను నింపబోతున్నాం. 185 కోట్ల రూపాయ‌లతో పనులు జరుగుతున్నాయి. మరో నాలుగు నెలల్లో పూర్తి అవుతాయి. ఇదంతా సీఎం వైయ‌స్‌ జ‌గ‌న్ చేసిన కృషి కాదా..? ఇది కాదా అభివృద్ధి..? అని నేను మిమ్మ‌ల్నిఅడుగుతున్నాను. కొంత‌మంది క‌ళ్లు ఉన్నా చూడ‌లేని, చెవులు ఉండి వినలేని వాళ్ళు, నిద్ర న‌టించే వాళ్ల‌ను ఏం అన‌గలం అని అన్నారు.

 గతంలో పండే పంట అమ్ముకోవాలి అంటే ఎవరో వ్యాపారి కోసం వేచి ఉండాలి. ఈ రోజు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రం ఏర్పాటుతో అక్కడే పంట కొనుగోలు చేసేవిధంగా చర్యలు తీసుకున్నాం. ఇంకా రైతులకు చేరువగా ఉండే విధంగా ఆర్బీకేలు ఏర్పాటు చేసి,వ్య‌వ‌సాయానికి అవ‌స‌రం అయిన విత్త‌నాలు,ఎరువులు అందించాం. రైతు మేలు కోరి,ఇంకా అన్ని వ‌ర్గాల మేలు కోరి సంక్షేమం,అభివృద్ధి అన్న‌వి ధ్యేయంగా,ఎప్ప‌టికప్పుడు ఈ రెండింటికీ సమ ప్రాధాన్యం ఇస్తూ..ప‌నిచేస్తూ ఉన్నామ‌ని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.

Best Web Hosting Provider In India 2024