YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.24-11-2022(గురువారం) ..
గడపగడపకు- మన ప్రభుత్వం నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
పట్టణంలోని 13 -14 వార్డుల సచివాలయానికి రూ.20 లక్షల నిధులు మంజూరు ..
నందిగామ పట్టణంలోని 13 ,14 వార్డులలో గడపగడపకు- మన ప్రభుత్వం నిధులు రూ.20 లక్షలతో చేపట్టిన సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులు , సిసి రోడ్ల నిర్మాణ పనులకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు గురువారం శంకుస్థాపన నిర్వహించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందిగామ పట్టణంలో గడపగడపకు విజయవంతంగా జరుగుతుందని , గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు , ఆయా సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కలుగుతుందని తెలిపారు ,ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగానే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తయిన గ్రామ లేదా వార్డు సచివాలయ పరిధికి రూ.20 లక్షల నిధులు మంజూరు చేస్తున్నారని ఆ నిధులతో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు , పట్టణంలోని 13 -14 వార్డుల సచివాలయానికి రూ.20 లక్షల ప్రభుత్వ నిధులు మంజూరయ్యాయని , రెండు వార్డులకు చేరో రూ.10 లక్షలు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు ,పట్టణంలోని పది సచివాలయాలకు గడపగడపకు మన ప్రభుత్వం నిధులు రూ.2 కోట్ల రూపాయలు మంజూరు కానున్నాయని చెప్పారు ..
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ డాక్టర్ జయరాం , కౌన్సిల్ సభ్యులు గద్దె శేషు కుమారి , నాదెండ్ల నరేంద్ర , గద్దె రమేష్ , నరసింహారావు, మారం అమరయ్య , షేక్ ఖాలిక్, పాకాలపాటి కిరణ్ , షేక్ జాఫర్ , మన్నెం దాసు , మండవ పిచ్చయ్య ,మహమ్మద్ మస్తాన్ ,పాములపాటి రమేష్, గుడివాడ సాంబశివరావు, దొంతి రెడ్డి దేవేందర్ రెడ్డి , చల్లా బ్రహ్మం ,నల్లమల్లి మురళి, బండారు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు ..