YSRCP Nandigama : పట్టణంలోని 11 వ వార్డులో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”..

YSRCP Nandigama :

 

 

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.24-11-2022(గురువారం) ..

అభివృద్ధి -సంక్షేమమే వైయస్ జగన్ ప్రభుత్వ ధ్యేయం ..

పట్టణంలోని 11 వ వార్డులో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

నందిగామ పట్టణంలోని 11 వ వార్డు పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ – ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు అడిగి తెలుసుకున్నారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ,ప్రజాసంక్షేమమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయమని , ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను అమలు చేసి అదనంగా మరికొన్ని పథకాలను ప్రవేశపెట్టి ప్రజా హృదయాల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు , జగన్ మోహన్ రెడ్డి పాలనకు మంచి మార్కులు పడుతుండటంతో ప్రతిపక్ష టిడిపి నేతలు ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు , ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలంతా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తోనే ఉన్నారని , ప్రతి గడపలోను ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు , ఈ మూడేళ్ల కాలంలో చేసిన మంచి చెప్పడానికే గడప గడపకు- మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నామని , ప్రజలు తెలిపిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామన్నారు ..

ఈ కార్యక్రమంలో మహమ్మద్ మస్తాన్ , మండవ పిచ్చయ్య , రసూల్ ,దొంతిరెడ్డి దేవేందర్ రెడ్డి , కృపారావు , పోతురాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,సచివాలయ సిబ్బంది , వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *