Best Web Hosting Provider In India 2024
valentine’s day Wishes: వాలెంటైన్స్ డే… ప్రేమికులకు పండగతో సమానం. వారి ఆనందానికి, వారి జ్ఞాపకాలకి వాలెంటైన్స్ డే ప్రత్యేకంగా నిలుస్తుంది. ఒక్కసారి ప్రేమలో పడితే వారి ప్రపంచం ఎరుపు రంగుతో నిండిపోతుంది. కలలో కూడా ఎర్ర గులాబీలు, ఎరుపెక్కిన గుండెలే పలకరిస్తాయి. మనసులో ఉన్న ప్రేమను వ్యక్తీకరించడానికి ఏడాదిలో వచ్చే ఒక అందమైన రోజు వాలెంటైన్స్ డే. ఈరోజు కోసం వేలాది ప్రేమికులు ఎదురుచూస్తూ ఉంటారు. కొంతమంది ఇదే రోజున తమ ప్రేమను వ్యక్తీకరిస్తే, మరికొందరు ఇదే రోజున ప్రేమను పెద్దలకు తెలియజేసి పెళ్లి పీటల వరకు తీసుకెళ్తారు. ఈ ప్రేమికుల దినోత్సవాన… మీ మనసులో నిండిన ప్రియురాలికి లేదా ప్రేమికుడికి తెలుగులోనే అందంగా విషెస్ చెప్పండి. వారి మనసు కరిగిపోవడం ఖాయం.
ట్రెండింగ్ వార్తలు
1. నీ దగ్గర ఉన్నంత చనువుగా ఎవరి దగ్గర ఉండలేను.
ఇలా జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నాను.
హ్యాపీ వాలెంటైన్స్ డే
2. పరిస్థితులను బట్టి మారిపోయేది ప్రేమ కాదు.
పరిస్థితుల్ని అర్థం చేసుకొని ముందుకు సాగేది ప్రేమ.
అదే నా ప్రేమ.
నా ప్రేమను అంగీకరిస్తావని కోరుకుంటూ..
హ్యాపీ వాలెంటైన్స్ డే
3. కాలం మారవచ్చు
కలలు మారవచ్చు
కానీ మీ పట్ల నా మనసులో ఉన్న
ప్రత్యేక స్థానం ఎప్పటికీ మారదు.
ఆ స్థానాన్ని జీవితాంతం
అలానే ఉండాలని కోరుకుంటున్నా
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు
4. నువ్వే నేనైతే
నీ ప్రేమ నాదే
నీ జీవితం నాదైతే…
నీ కష్టసుఖాలు నావే
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు
5.నీవు లేని నిన్న నాకు శూన్యం
నీవు రాని రేపు నాకు ఒక నరకం
నీవు లేని నిన్నను ఊహించలేను
నీవు రాని రేపు కోరుకోలేను
నీతో ఉన్న ఈ క్షణాలే నాకు సర్వస్వం
హ్యాపీ వాలెంటైన్స్ డే
6. నీకోసం కష్టమేమీ కాదు నా ప్రాణాన్ని ఇవ్వడం.
నా ప్రాణంతో నైనా నువ్వు కలకాలం జీవిస్తానంటే
ఈ క్షణమే ఇచ్చేస్తా.
హ్యాపీ వాలెంటైన్స్ డే
7. నీతో ఉంటే సంతోషం
నువ్వు లేకపోతే నరకం
నిన్ను పొందడమే నా జీవిత లక్ష్యం
హ్యాపీ వాలెంటైన్స్ డే
8. మనం వెతికేది నిజమైన ప్రేమ కాదు.
మనల్ని వెతుక్కుంటూ వచ్చేదే నిజమైన ప్రేమ.
ఆ ప్రేమ నీవల్ల నాకు దక్కింది.
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు
9. ఎవరికైనా జీవితకాలం అంటే
జనన మరణాల మధ్య కాలం
నాకు మాత్రం నీతో గడిపిన కాలమే
నేను జీవించిన కాలం
హ్యాపీ వాలెంటైన్స్ డే
10. నా యద నిండా నీ రూపం నింపేస్తా
నీ మదిరిండా నా ప్రేమను కురిపిస్తా
నీ తోడునై నేను ముందుకు నడిపిస్తా
నీ నీడనై నీ వెంటే నడిచొస్తా
నా ప్రేమ మొత్తం నీకే అందిస్తా
నా ప్రేమను అంగీకరిస్తావని కోరుకుంటున్నా
హ్యాపీ వాలెంటైన్స్ డే
11. నా ఆనందంలో నువ్వు
నా ఊహల్లో నువ్వు
నా గుండెల్లో నువ్వు
నేను అనే పదానికి అర్థమే నువ్వు
ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు
12. మనసులో ఉన్న ప్రేమను చెప్పడానికి ఒక్క క్షణం చాలు
కానీ ఆ ప్రేమ నిజమని చూపించడానికి జీవిత కాలం సరిపోతుంది
ఆ జీవిత కాలం సమయాన్ని నువ్వు నాకు ఇస్తావని కోరుకుంటున్న
హ్యాపీ వాలెంటైన్స్ డే
13. ప్రతిక్షణం నీ కోసమే నా ఆలోచన
నీ ప్రేమ ఒక అనురాగం
నీ ప్రేమ ఒక అనుబంధం
నీ ప్రేమ కోసం జీవితాంతం నిరీక్షిస్తాను
హ్యాపీ వాలెంటైన్స్ డే
14. మనం ప్రేమించే వాళ్ళు ఎంత మందైనా దొరుకుతారు
కానీ మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడమే అదృష్టం
నీవల్ల నాకు ఆ అదృష్టం దక్కింది
హ్యాపీ వాలెంటైన్స్ డే
15. మనిషి ఒకేసారి ప్రేమలో పడతాడని అంటారు
కానీ నిన్ను చూసిన ప్రతిసారీ నేను ప్రేమలో పెడుతున్నాను
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు
16. నువ్వు నాతో ఒక్కసారి మాట్లాడితేనే నాకు ఇంత ఆనందంగా ఉంటే
నువ్వు జీవితాంతం నాతోనే ఉంటే ఇంకెంత సంతోషంగా ఉంటానో
అలాంటి జీవితాన్ని నువ్వు నాకు ఇస్తావని కోరుకుంటున్నా
హ్యాపీ వాలెంటైన్స్ డే