Best Web Hosting Provider In India 2024
Best Malayalam Love Movies: సినీ పరిశ్రమలో ప్రతి ఏటా మిగిలిన జోనర్స్‌తో పోలిస్తే ప్రేమకథతోనే ఎక్కువ సినిమాలు తెరకెక్కుతోంటాయి. ప్రేమ లేని సినిమా ఉండదంటే అతిశయోక్తి కాదు. మిగిలిన కథలతో పోలిస్తే లవ్ స్టోరీస్ సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే భేదాలు లేకుండా ప్రతి ఇండస్ట్రీలో ఎవర్‌గ్రీన్ సినిమాల లిస్ట్‌లో ఎక్కువగా ప్రేమకథలే కనిపిస్తుంటాయి. ప్రేమకథలను తెరకెక్కించడంలో మలయాళ దర్శకుది ప్రత్యేకమైన పంథా. రియలిస్టిక్ అప్రోచ్ మలయాళ ప్రేమకథా చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇటీవల మలయాళంలో వచ్చిన కొన్ని మలయాళ ప్రేమకథా చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఆ సినిమాలు ఏవంటే?
ట్రెండింగ్ వార్తలు
ప్రేమమ్…
మలయాళంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ లవ్‌స్టోరీస్‌లో ప్రేమమ్ ఒకటి. నివీన్ పాల్ హీరోగా ఆల్పోన్సో పుత్రేన్ దర్శకత్వంలోరూపొందిన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఓ యువకుడి జీవితంలో మూడు దశల్లో సాగే ప్రేమకథతో తెరకెక్కిన ఈ మూవీకి అన్ని భాషల ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ప్రేమమ్‌తోనే సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. ప్రేమమ్ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది.ప్రేమమ్ మూవీని తెలుగులో అదే పేరుతో నాగచైతన్య రీమేక్ చేశాడు. తెలుగులోనూ ఈ సినిమా హిట్టయింది.
హ్రిదయం
ప్రణవ్ మోహన్‌లాల్, దర్శనరాజేంద్రన్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా నటించిన హ్రిదయం మూవీ మ్యూజికల్ లవ్‌స్టోరీగా యూత్ఆడియెన్స్‌ను మెప్పించింది. వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో 2022లో రిలీజైన ఈ మూవీ ఆ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన మలయాళ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఓ యువకుడి ప్రేమ ప్రయాణాన్ని ఎమోషనల్‌గా ఆవిష్కరిస్తూ సాగే ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఎన్ను నింతే మోయిదీన్
సలార్ ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఎన్ను నింతే మోయిదీన్ మూవీ మలయాళ ఇండస్ట్రీలో బెస్ట్ లవ్‌స్టోరీ మూవీస్‌లో ఒకటిగా సినీ వర్గాలు చెబుతుంటాయి. తమ ప్రేమను దక్కించుకోవడం కోసం ఇరవై రెండేళ్లు ఎదురుచూసిన ఓ జంట కథతో దర్శకుడు ఆర్ ఎస్ విమల్ ఈ మూవీని తెరకెక్కించాడు. పార్వతి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనే రిలీజైంది.తొమ్మిదేళ్ల క్రితమే ఈ మూవీ యాభై కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.
నివీన్ పాల్ మయానది
నివీన్ పాల్ మయానది డిఫరెంట్ లవ్‌స్టోరీగా మలయాళ ఆడియెన్స్‌ను మెప్పించింది. సన్ నెక్స్ట్‌లో ఈ మూవీని చూడొచ్చు.
వీటితో పాటు ఓమ్ శాంతి ఓశనా (డిస్నీ ప్లస్ హాట్ స్టార్), తన్నీర్ మాథల్ దినంగల్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), అన్నయుమ్ రాసూలూమ్ ( డిస్నీ ప్లస్ హాట్ స్టార్), బెంగళూరు డేస్ (డిస్నీ ప్లస్ హాట్ స్టార్), హండ్రెడ్ డేప్ ఆఫ్ లవ్ (అమెజాన్ ప్రైమ్ వీడియో). రమంతే ఎడన్ తోట్టమ్ ( సన్ నెక్స్ట్) బ్యూటిఫుల్ లవ్‌స్టోరీగా మలయాళ ఆడియెన్స్‌ను మెప్పించాయి.