Hyderabad : కారు డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌… స్పాట్ లో ఎక్సైజ్ సీఐ మృతి

Best Web Hosting Provider In India 2024

Road Accident in Lb Nagar: హైదరాబాద్ లోని ఎల్బీనగర్‌లో మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్ లో వచ్చిన కారు… బైక్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఎక్సైజ్ సీఐ సాధిక్ అలీ స్పాట్ లోనే మృతి చెందారు. ఎస్సై మొహినుద్దీన్‌ తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. మృతి చెందిన సాధిక్ ఛార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మొహినుద్దీన్ నారాయణగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

సీఐ సాధిక్ అలీ, ఎస్సై మొహినుద్దీన్‌ మలక్‌పేట్‌లోని ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఉంటున్నట్లు తెలిసింది. ఎల్బీనగర్‌లో ఓ ఫంక్షన్‌కి వెళ్లి తిరిగి క్వార్టర్స్‌కు వెళుతుండడగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటన తర్వాత కారు డ్రైవర్ అక్కడ్నుంచి పరారీ కాగా….. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని కారణాలు తెలియాల్సి ఉంది.

WhatsApp channel

టాపిక్

Crime TelanganaHyderabadTelangana NewsTrending TelanganaLb Nagar Assembly Constituency
Source / Credits

Best Web Hosting Provider In India 2024