YSRCP Nandigama : పట్టణంలోని 11 వ వార్డు లో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”..

YSRCP Nandigama :

 

 

 

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.26-11-2022(శనివారం) ..

జవాబుదారీ పాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ..

పట్టణంలోని 11 వ వార్డు లో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

నందిగామ పట్టణంలోని 11 వ వార్డులో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ – ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు అడిగి తెలుసుకున్నారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై నమ్మకంతో ఓట్లు వేసి ముఖ్యమంత్రిగా గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రభుత్వాన్ని నేరుగా ప్రజల ఇళ్ల ముంగిటకే తీసుకువెళ్లి సంక్షేమ పథకాలను అందజేస్తున్నట్లు తెలిపారు , దేశ చరిత్రలోనే ఎక్కడా లేనివిధంగా 175 సీట్లకు గాను 151 సీట్లతో ఒక పార్టీకి అధికారాన్ని అప్పజెప్పిన ప్రజల అభిమానానికి జవాబుదారితనంగా ఈ మూడేళ్లలో చేసిన పరిపాలనను వివరిస్తూ ,వారి ఇళ్ల ముంగిటకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే విధంగా కార్యచరణ రూపొందించి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు ,గతంలో ఏ పాలకులు కూడా ఎన్నికలప్పుడు తప్పితే ప్రజల వద్దకు వెళ్లిన దాఖలాలు లేవని ,గతానికి భిన్నంగా నేడు వైయస్ జగన్ ప్రభుత్వాన్నే నేరుగా ప్రజల వద్దకు తీసుకువెళ్తున్నారన్నారు ,ప్రజల పట్ల అంకితభావంతో -చిత్తశుద్ధితో పనిచేసి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాజనీతిజ్ఞుడుగా పేరు తెచ్చుకున్నారన్నారు ..

ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ డాక్టర్ జయరాం ,ఏఈ ఫణి శ్రీనివాస్, వార్డు ఇన్చార్జ్ షేక్ రసూల్ , మండవ పిచ్చయ్య ,మహమ్మద్ మస్తాన్ , గుడివాడ సాంబశివరావు , కౌన్సిలర్లు పాకాలపాటి కిరణ్ , కృపారావు, దాసు , బండారు వెంకట్రావు , మున్నాభాయ్ ,చవట గురునాథం, కృష్ణ ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ,తదితరులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *