Best Web Hosting Provider In India 2024
Celebrity Cricket League 2024: సినిమాల్లో యాక్టింగ్, యాక్షన్, డ్యాన్సులు, డైలాగ్‍లతో దుమ్మురేపే స్టార్లు మైదానంలో హోరాహోరీగా తలపడే టోర్నీనే సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL). తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, పంజాబీ, భోజ్‍పురి, బెంగాలీ భాషల సినీ ఇండస్ట్రీల నటులు, టెక్నిషియన్లు ఈ టోర్నీలో తలపడతారు. ఈ ఏడాది టోర్నీలోనూ 8 జట్లు తలపడనున్నాయి. టాలీవుడ్ టీమ్ తెలుగు వారియర్స్ కూడా టోర్నీకి సిద్ధమైంది.
ట్రెండింగ్ వార్తలు
ఈ ఏడాది సీసీఎల్-2024 టోర్నీ ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 17వ తేదీ వరకు జరగనుంది. ఫిబ్రవరి 23 నుంచి 25 వరకు మ్యాచ్‍లు షార్జాలో జరగనున్నాయి. ఆ తర్వాత హైదరాబాద్, చండీగఢ్, త్రివేండ్రం, వైజాగ్‍లో మ్యాచ్‍లు ఉంటాయి. ఫైనల్‍తో కలిసి మొత్తంగా 20 మ్యాచ్‍లు ఉంటాయి. హీరో అక్కినేని అఖిల్ కెప్టెన్‍గా ఉన్న తెలుగు వారియర్స్ డిఫెండింగ్ చాంపియన్‍గా బరిలోకి దిగుతోంది. ఆ వివరాలు ఇవే.
సీసీఎల్ 2024 జట్లు ఇవే
తెలుగు వారియర్స్, ముంబై హీరోస్, చెన్నై రైనోస్, కర్ణాటక బుల్డోజర్స్, కేరళ స్ట్రైకర్స్, బెంగాలీ టైగర్స్, భోజ్‍పురి దబాంగ్స్, పంజాబ్ దె షేర్ జట్లు ఈ సెలెబ్రిటీ క్రికెట్ లీగ్‍లో తలపడనున్నాయి.
సీసీఎల్ 2024 లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్ట్
సీసీఎల్ 2024 టోర్నీ మ్యాచ్‍లు జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో లైవ్ స్ట్రీమింగ్ అవుతాయి. ఉచితంగా ఈ మ్యాచ్‍ల లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు. జీ సినిమాలు ఛానెల్‍లో తెలుగులో ఈ మ్యాచ్‍లో లైవ్ టెలికాస్ట్ వస్తుంది.
సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ 2024 మ్యాచ్‍ల పూర్తి షెడ్యూల్
- ముంబై హీరోస్ vs కేరళ స్ట్రైకర్స్ – ఫిబ్రవరి 23, రాత్రి 7 గంటలకు – షార్జా
- తెలుగు వారియర్స్ vs భోజ్‍పురి దబాంగ్స్ – ఫిబ్రవరి 24, మధ్యాహ్నం 2:30 గంటలకు – షార్జా
- కేరళ స్ట్రైకర్స్ vs బెంగాల్ టైగర్స్ – ఫిబ్రవరి 24, రాత్రి 7 గంటలకు – షార్జా
- చెన్నై రైనోస్ vs పంజాబ్ దే షేర్: ఫిబ్రవరి 25, మధ్యాహ్నం 2:30 గంటలకు – షార్జా
- ముంబై హీరోస్ vs కర్ణాటక బుల్డోజర్స్: ఫిబ్రవరి 25, రాత్రి 7 గంటలు – షార్జా
- చెన్నై రైనోస్ vs భోజ్‍పురి దబాంగ్స్ – మార్చి 1, మధ్యాహ్నం 2.30 గంటలకు – హైదరాబాద్
- తెలుగు వారియర్స్ vs పంజాబ్ దె షేర్ – మార్చి 1, రాత్రి 7 గంటలకు – హైదరాబాద్
- ముంబై హీరోస్ వర్సెస్ బెంగాల్ టైగర్స్ – మార్చి 2, మధ్యాహ్నం 2:30 గంటలు, హైదరాబాద్
- ముంబై హీరోస్ Vs భోజ్‍పురి దబాంగ్స్ – మార్చి 2, రాత్రి 7 గంటలకు – హైదరాబాద్
- చెన్నై రైనోస్ vs కర్ణాటక బుల్డోజర్స్ – మార్చి 3, మధ్యాహ్నం 2:30 గంటలకు – హైదరాబాద్
- తెలుగు వారియర్స్ vs కేరళ స్ట్రైకర్స్ – మార్చి 3, రాత్రి 7 గంటలకు – హైదరాబాద్
- పంజాబ్ దె షేర్ vs బెంగాల్ టైగర్స్ – మార్చి 8, రాత్రి 7 గంటలకు, చండీగఢ్
- బెంగాల్ టైగర్స్ vs భోజ్‍పూరి దబాంగ్స్ – మార్చి 9, మధ్యాహ్నం 2:30 గంటలకు – చండీగఢ్
- పంజాబ్ దె షేర్ vs ముంబై హీరోస్ – మార్చి 9, రాత్రి 7 గంటలకు – చండీగఢ్
- తెలుగు వారియర్స్ vs కర్ణాటక బుల్డోజర్స్ – మార్చి 10, మధ్యాహ్నం 2.30 గంటలకు – త్రివేండ్రం
- చెన్నై రైనోస్ vs కేరళ స్ట్రైకర్స్ – మార్చి 10, రాత్రి 7 గంటలు, త్రివేండ్రం
- ప్లేఆఫ్స్ – క్లాలిఫయర్ 1 – మార్చి 15, మధ్యాహ్నం 2.30 గంటలకు – వైజాగ్
- ప్లేఆఫ్స్ – ఎలిమినేటర్ 1 – మార్చి 15, సాయంత్రం గంటలకు – వైజాగ్
- ప్లేఆఫ్స్ – క్వాలిఫయర్ 2 – మార్చి 16, సాయంత్రం 7 గంటలకు – వైజాగ్
- ఫైనల్స్ – మార్చి 17, రాత్రి 7 గంటలకు – వైజాగ్