Palak Biryani: పాలకూర తినాలనిపించకపోతే పాలక్ బిర్యాని చేసుకోండి, అప్పుడు ఎంతైనా తినాలనిపిస్తుంది

Best Web Hosting Provider In India 2024

Palak Biryani: పాలకూర పేరు వింటేనే చాలామందికి నచ్చదు. నిజానికి పాలకూర చేసే మేలు ఇంతా అంతా కాదు. వారంలో నాలుగైదు సార్లు కచ్చితంగా తినాల్సిన ఆకుకూర పాలకూర. కానీ ఒక్కసారి కూడా వారంలో తినేవారు లేరు. పప్పులో ఇంత పాలకూర వేసి వండుతున్నారు, కానీ పూర్తిగా పాలకూర కర్రీని తినేవారు తగ్గిపోయారు. అది అంతగా రుచి లేకపోవడమే కారణం. అలాంటివారు పాలక్ బిర్యానీని ప్రయత్నించండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు ఈ పాలక్ బిర్యాని పెట్టడం వల్ల పాలకూరలోని పోషకాలను అందుతాయి. ఈ పాలక్ బిర్యాని రెసిపీ ఇదిగో.

ట్రెండింగ్ వార్తలు

పాలక్ బిర్యానీ రెసిపీకి కావలసిన పదార్థాలు

పాలకూర – రెండు కట్టలు

అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను

బాస్మతి బియ్యం – రెండు కప్పులు

నెయ్యి – రెండు స్పూన్లు

యాలకులు – నాలుగు

బిర్యానీ ఆకు – రెండు

కారం – ఒక స్పూను

దాల్చిన చెక్క – చిన్న ముక్క

పసుపు – అర స్పూను

పుదీనా – ఒక కట్ట

నీరు – తగినంత

లవంగాలు – నాలుగు

జాపత్రి – రెండు ముక్కలు

గరం మసాలా పొడి – ఒక స్పూను

జీలకర్ర పొడి – ఒక స్పూన్

ధనియాల పొడి – ఒక స్పూన్

కొత్తిమీర తరుగు – నాలుగు స్పూన్లు

ఉప్పు – రుచికి సరిపడా

పాలక్ బిర్యాని రెసిపీ

1. బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టి ఉడికించాలి. ఆ అన్నంలోనే ఉప్పు కూడా రుచికి సరిపడా వేయాలి.

2. అన్నం పూర్తిగా ఉడకకుండా 80% ఉడికాక ఆపేయాలి.

3. ఇప్పుడు పాలకూరని శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి.

4. మిక్సీ జార్లో పాలకూర, కొత్తిమీర, పుదీనా వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి.

5. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి నెయ్యి వేయాలి.

6. ఆ నెయ్యిలోనే అల్లం వెల్లుల్లి పేస్టు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, జాపత్రి వేసి వేయించుకోవాలి.

7. అవి వేగాక గరం మసాలా, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేయించుకోవాలి.

8. ఇవన్నీ బాగా వేగాక పాలకూర పేస్టును కూడా వేసి వేయించాలి.

9. మంటను చిన్నగా పెట్టి వండాలి. లేకపోతే ఇది త్వరగా మాడిపోతుంది.

10. పాలకూర బాగా ఉడికి నూనె పైకి తేలుతున్నప్పుడు ముందుగా వండుకున్న అన్నాన్ని ఇందులో కలపాలి.

11. పైన కాస్త నీళ్లు చిలకరించి మూత పెట్టేయాలి.

12. చిన్న మంట మీద పది నిమిషాలు ఉడికించాలి. అంతే బిర్యానీ రెడీ అయిపోతుంది.

13. అన్నం ముద్ద అయ్యేలే కాకుండా పులిహార లాగా పైపైన కలుపుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.

14. ఇది ఆకుపచ్చని రంగులో నోరూరించేలా ఉంటుంది.

ఇందులో మనం ప్రధానంగా వాడింది పాలకూర. కాబట్టి పాలక్ బిర్యాని ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. పాలకూరలో ఉన్న పోషకాలు మన శరీరానికి అత్యవసరమైనవి. ఇవి చర్మాన్ని కాపాడతాయి. చర్మ క్యాన్సర్ నుంచి రక్షిస్తాయి. హైబీపీ ఉన్నవారు పాలకూరతో చేసిన వంటలు కచ్చితంగా తినాలి. పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ రెండూ కూడా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి చాలా అవసరం. అలాగే పాలకూరలో ఉండే పొటాషియం రక్తనాళాలను కాపాడుతుంది. రక్తనాళాల్లో ఒత్తిడి పెరగకుండా అడ్డుకొని అధిక రక్తపోటును రాకుండా నిరోధిస్తుంది. కంటి చూపుకు పాలకూర చాలా అవసరం. కాబట్టి పిల్లలు పాలకూర తినకపోతే ఇలా పాలక్ బిర్యాని తయారు చేసి వారికి తినిపించండి.

WhatsApp channel

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024