Kaatera on OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న కాటేరా.. ఆ మార్క్ దాటేసిన దర్శన్ సినిమా.. ఒక్క భాషే అయినా..

Best Web Hosting Provider In India 2024

Kaatera OTT: ఛాలెంజింగ్ స్టార్, కన్నడ హీరో దర్శన్ తూగుదీప నటించిన కాటేరా చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. గత డిసెంబర్ 29వ తేదీన ఈ యాక్షన్ డ్రామా థియేటర్లలో రిలీజ్ అయింది. కన్నడలో మాత్రమే విడుదలైన ఈ మూవీ రూ.100కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి సత్తాచాటింది. ఈ కాటేరా చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకెళుతోంది. ఓ మైలురాయిని దాటింది.

ట్రెండింగ్ వార్తలు

కాటేరా చిత్రం ఫిబ్రవరి 9వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే ఇప్పుడు ఐదు రోజుల్లోనే ఈ చిత్రం 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ దాటింది. దీంతో ఈ చిత్రం రికార్డులను బ్రేక్ చేసిందంటూ జీ5 ఓటీటీ వెల్లడించింది.

ఒకే భాషలో స్ట్రీమింగ్ అవుతున్నా..

కాటేరా చిత్రం ప్రస్తుతం కన్నడ భాషలో మాత్రమే జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍ అవుతోంది. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ ఉన్నాయి. ఒకే భాషలో స్ట్రీమ్ అవుతున్న చిత్రం 5 రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మార్క్ దూటడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇతర భాషల వారు కూడా ఇంగ్లిష్ సబ్‍టైటిళ్లతో ఈ కటేరా మూవీని బాగానే చూస్తున్నారని దీని ద్వారా అర్థమవుతోంది.

కాటేరా చిత్రానికి తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించారు. ఆయనతో పాటు జగదీశ్ కుమార్ హంపీ కూడా డైలాగ్స్ అందించారు. హీరో దర్శన్ – తరుణ్ కాంబో ఈ చిత్రంతో రెండోసారి రిపీట్ అయింది. 1970ల నాటి బ్యాక్‍డ్రాప్ కాటేరా చిత్రంలో ఎక్కువగా ఉంటుంది. భూస్వాముల చేతుల్లో రైతులు, నిమ్నవర్గాల ప్రజలు అణచివేతకు గురవడం కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన అంశంగా ఉంది.

ఇనుప పనిముట్లను, ఆయుధాలను తయారు చేసే కమ్మరి ‘కాటేరా’ పాత్రలో దర్శన్ ఈ మూవీలో నటించారు. ఆయన యాక్టింగ్ ఈ చిత్రానికి ప్రధానమైన హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ఆరాధనా రామ్ హీరోయిన్‍గా నటించారు. జగపతి బాబు, కుమార్ గోవింద్, వినోద్ కుమార్ అల్వా, శృతి, వైజనాత్ బిర్దార్ కీలకపాత్రలు పోషించారు.

రాక్‍లైన్ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై రాక్‍లైన్ వెంకటేశ్ నిర్మించిన కాటేరా చిత్రానికి వి.హరికృష్ణ సంగీతం అందించారు. సుమారు రూ.40కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం రూ.104కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‍గా నిలిచింది. ఓటీటీలోకి వచ్చాక కూడా కర్ణాటకలోనే కొన్ని థియేటర్లలో కాటేరా ఇంకా ఆడుతోంది.

కాటేలా స్టోరీ బ్యాక్‍డ్రాప్ ఇదే..

కర్ణాటకలోని భీమనహల్లి ప్రాంతంలో కాటేరా కథ ఉంటుంది. ఆ ప్రాంతంలో సాగు చేస్తున్న రైతులకు భూములు దక్కేలా.. భూసంస్కరణల చట్టం అమలయ్యేందుకు కాటేరా పోరాడతాడు. ఈ క్రమంలో భూస్వాములపై పోరాటం చేస్తాడు. చాలా సవాళ్లను ఎదుర్కొంటాడు. ఈ సినిమా ఓపెనింగ్‍లో ముసలితనంలో ఉన్న కాటేరా (దర్శన్) జైలులో కనిపిస్తాడు. పెరోల్‍పై తన గ్రామానికి కానిస్టేబుల్ (అచ్యుత్ కుమార్)తో పాటు వెళతాడు. ఆ తర్వాత అక్కడ కాటేరాపై దాడి జరుగుతుంది. అప్పుడు 1970ల కాలంలో జరిగిన విషయాలను కానిస్టేబుల్‍కు కాటేరా వివరిస్తాడు. దీంతో అసలు కథ షురూ అవుతుంది. అప్పట్లో రైతులకు భూములు దక్కేలా కాటేరా చేయగలిగాడా? భూస్వాములను ఎలా ఎదుర్కొన్నాడు? గ్రామంలో దొరిగిన అస్థిపంజరాలతో కాటేరాకు ఉన్న సంబంధం ఏంటి? అతడు జైలుకు ఎందుకు వెళ్లాడు? అనేవే ఈ చిత్రం ప్రధాన అంశాలుగా ఉన్నాయి.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024