Best Web Hosting Provider In India 2024
IRCTC Hyderabad Shirdi Tour 2024 : అతి తక్కువ ధరలోనే కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్సీటీసీ టూరిజం. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి షిర్డీ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ‘SAI SANNIDHI EX HYDERABAD’ అనే పేరుతో ఈ టూర్ ను ఆపరేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ఫిబ్రవరి 21, 2024వ తేదీన అందుబాటులో ఉంది. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రతి బుధవారం ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
హైదరాబాద్ – షిర్డీ టూర్ షెడ్యూల్:
- ఫస్ట్ డే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (అజంతా ఎక్స్ ప్రెస్) నుంచి సాయంత్రం 06.50 నిమిషాలకు బయల్దేరుతారు. రాత్రంతా జర్నీ ఉంటుంది.
- రెండో రోజు ఉదయం 07.10 నిమిషాలకు నాగర్ సోల్ రైల్వేస్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి షిర్డీకి వెళ్తారు. హెటల్ లోకి చెకిన్ అవుతారు. అనంతరం షిర్డీ ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం 4 గంటలకు హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. ఆ తర్వాత శని శిగ్నాపూర్ కు వెళ్తారు. అక్కడ్నుంటి నాగర్ సోల్ రైల్వే స్టేషన్ కు బయల్దేరుతారు. రాత్రి 08 .30 గంటలకు జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు.
- మూడో రోజు ఉదయం 08.50 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
షిర్డీ టూర్ టికెట్ ధరలు:
Hyderabad Shirdi Tour Prices 2024: హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ షిర్డీ టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు చూస్తే…. సింగిల్ షేరింగ్ కు రూ. 7790 గా ఉండగా… డబుల్ షేరింగ్ కు రూ. 6560 ధరగా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 6550గా ఉంది. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 4910గా ఉంది. గతేడాది డిసెంబర్ లో ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ. 8,680 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ.7,010ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు 6,840గా నిర్ణయించారు. కంఫార్ట్ క్లాస్ల్ కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. గతంలో ఉన్న ధరలతో పోల్చితే… ప్రస్తుతం ధరలు తగ్గాయి. ఈ టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్లో వసతి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి కవర్ అవుతాయి. నిబంధనలు కూడా వర్తిస్తాయి. పూర్తి వివరాల కోసం కింద ఇచ్చిన జాబితాను చూడండి. https://www.irctctourism.com/ క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.
అరకు టూర్
IRCTC Visakhapatnam Araku Tour 2024 : తాజాగా అరకు అందాలను చూసేందుకు 3 రోజుల టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది ఐఆర్ సీటీసీ. ‘VIZAG – ARAKU HOLIDAY PACKAGE ‘ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. విశాఖ నుంచి ప్రస్తుతం ఈ టూర్ ఫిబ్రవరి 16,2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ టూర్ లో అరకులోని పలు ప్రాంతాలను చూపిస్తారు. ఫస్ట్ డే విశాఖ సిటీ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. విశాఖలని తొట్లకొండ బుద్దిస్ట్ కాంప్లెక్స్, కైలాసగిరి, రుషికొండ బీచ్ లను సందర్శిస్తారు. రాత్రి విశాఖలోనే బస చేస్తారు. రెండో రోజు 8 గంటలకు అరకుకు వెళ్తారు. టన్నెల్స్, బ్రిడ్జిలపై నుంచి వెళ్తున్న సమయంలో ప్రయాణికులు సరికొత్త అనుభూతిని పొందుతారు. అరకు వ్యాలీకి చేరుకున్న తర్వాత… బస్సులో ప్రయాణం ఉంటుంది. ఇక్కడ ఉన్న ట్రైబల్ మ్యూజియంతో పాటు గార్డెన్స్ ను సందర్శిస్తారు. వచ్చే క్రమంలో అనంతగిరి కాఫీ ప్లాన్ టేషన్, గాలికొండ వ్యూ పాయింట్ కు వెళ్తారు. అనంతరం విశాఖకు వచ్చే మార్గంలో సబ్ మెరైన్ మ్యూజియంను సందర్శిస్తారు. ఆ తర్వాత సిటీకి చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
టాపిక్