YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల మండలం :
ది.28-11-2022(సోమవారం) ..
గనిఆత్కూరు గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
రూ. కోటి పది లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణం -మౌలిక వసతుల కల్పన ..
విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు ..
కంచికచర్ల మండలంలోని గనిఆత్కూరు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ. కోటి పది లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి -మౌలిక వసతుల కల్పనకు శాసనసభ్యులు డాక్టర్ జగన్ మోహన్ రావు గారు సోమవారం శంకుస్థాపన నిర్వహించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాంది పలికారని , ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు అన్ని వసతులు కల్పించడంతో పాటు కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు , గత ప్రభుత్వాలు కార్పొరేట్ పాఠశాలలకు మేలు చేసేందుకు ప్రభుత్వ పాఠశాలలను గాలికొదిలేశాయన్నారు , జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వం పాఠశాలలో అభివృద్ధి చేసి వాటికి జవసత్వాలు కల్పించారని తెలిపారు , ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని -పథకాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు ..
ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యులు షేక్ జానీ పాషా , పాడిబండ్ల హరి జగన్నాధరావు , మార్త శ్రీనివాసరావు , పేరెంట్స్ కమిటీ సభ్యులు ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ..