YSRCP Nandigama : మహాత్మ జ్యోతిబాపూలేకు ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే ..

YSRCP Nandigama :

 

 

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.28-11-2022(సోమవారం) ..

మహాత్మ జ్యోతిబాపూలేకు ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక.జగన్ మోహన్ రావు గారు ..

పీడిత ,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన చిరస్మరణీయుడు జ్యోతిరావు పూలే : ఎమ్మెల్యే డా”మొండితోక.జగన్ మోహన్ రావు గారు ..

మహాత్మ జ్యోతిబాపూలే 132 వ వర్ధంతి సందర్భంగా నందిగామ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరియు నందిగామ గాంధీ సెంటర్ లోని ఆయన చిత్రపటానికి, విగ్రహానికి శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ,

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సమాజంలో ఉన్న దురాచారాలకు ,కుల వివక్షకు వ్యతిరేకంగా 150 సంవత్సరాలకు పూర్వమే ప్రజలను కూడగట్టి పోరాడి , అనేక విజయాలు సాధించిన జ్యోతిబాపూలే దేశంలోని పీడిత వర్గాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు ,ఆయన స్ఫూర్తితోనే నేడు ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి బీసీల మరియు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు , భరత జాతి సంపదైనా జాతీయ నాయకులకు కుల, మత,వర్గాలను అంటగట్టి వేర్వేరు భావాలతో వీడదీయరాదన్నారు ,

ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు , నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు ,కోఆప్షన్ సభ్యులు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *