YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / వీరులపాడు :
ది.28-11-2022(సోమవారం) ..
అంగన్వాడి టీచర్లకు సెల్ ఫోన్ లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఇక పై అంగన్వాడిల్లో స్మార్ట్ సేవలు ..
మండలంలోని వీరులపాడు గ్రామంలో మండల పరిధిలోని అంగన్ వాడి టీచర్లకు ప్రభుత్వ అందజేస్తున్న మొబైల్ ఫోన్లను శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు సోమవారం పంపిణీ చేశారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ సెంటర్లలో గ్రామాల్లోని చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు, కిషోర బాలికలకు అందించే పౌష్టికాహార వివరాలతో పాటు బాలింతలు, గర్భిణుల వివరాలను అంగన్‌వాడీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు వివిధ రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంటుందని ,పలు సందర్భాల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించిన కార్యక్రమాల వివరాలను సైతం రికార్డుల్లో నమోదు చేయడానికి ప్రభుత్వం సెల్ ఫోన్లను అందజేస్తుందన్నారు ..
గతంలో ఈ విధంగా పుస్తకాల్లో నమోదు చేయడానికే కార్యకర్తలకు ఎక్కువ సమయం సరిపోతుందని ,దీంతో కార్యకర్తల సమయం వృథా కాకుండా ఉండేందుకు వారు చేపట్టే ప్రతి పనిని త్వరగా పూర్తి చేసేందుకు ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయడానికి ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేసేందుకు కార్యాచరణ చేపట్టిన్నట్లు తెలిపారు ,స్మార్ట్‌ఫోన్లు పంపిణీతో ప్రతి రోజు లబ్ధిదారుల ఇంటింటికి వెళ్ళి ఆన్‌లైన్లోనే వారి వివరాలు నమోదు చేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో రికార్డులు తిరగేసే పనిలేకుండా ఒక్క క్లిక్‌తో పని సులభంగా అయిపోవడం, సమయంతో పాటు ఇతర పనులు చేసుకోవచ్చన్నారు ..
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోటేరు లక్ష్మీ ముత్తారెడ్డి , జెడ్పిటిసి అమర్లపూడి కీర్తి సౌజన్య ,షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షహనాజ్ బేగం , మండల కన్వీనర్ ఆవుల రమేష్ బాబు , సిపిడిఓ లక్ష్మీ భార్గవి , పలు గ్రామాల సర్పంచులు ,ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు ..