YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.28-11-2022(సోమవారం) ..
నియోజకవర్గంలోని జలజీవన్ మిషన్ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ నియోజకవర్గానికి జల జీవన్ మిషన్ పథకానికి రూ.91.85 కోట్లు మంజూరు ..
ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి అందించటమే ధ్యేయం ..
నందిగామ పట్టణంలోని శాసనసభ్యుల వారి కార్యాలయంలో రూరల్ వాటర్ సప్లై(ఆర్డబ్ల్యూఎస్) అధికారులతో – స్థానిక ప్రజాప్రతినిధులతో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు జలజీవన్ మిషన్ పనులపై సోమవారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గం లోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్లు అందిస్తామని ,జల జీవన్ మిషన్ పథకానికి నియోజకవర్గంలోని 4 మండలాలకు రూ.91.85 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు ,మండలాల్లోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేయవలసిన పైపులైన్ పనులకు సంబంధించి అంచనాలను రూపొందించాలని ,త్వరితగతిన పనులను మొదలుపెట్టేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు , గతంలో మంజూరైన రూ.28 కోట్లతో పలు గ్రామాల్లో జలజీవన్ మిషన్ ద్వారా పైపులైన్ నిర్మాణ పనులు చేపట్టామని , ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తాగునీటి సరఫరా పై ప్రత్యేక దృష్టి సారించారన్నారు , ఎంతోకాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు పరిష్కారం చూపే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపట్టిన జల జీవన్ మిషన్ పనుల ద్వారా ప్రజల తాగునీటి కష్టాలు తీరతాయన్నారు ..
ఈ కార్యక్రమంలో ఏపీ ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ,నాలుగు మండలాల ఎంపీపీలు , జడ్పిటిసి లు ,వైస్ ఎంపీపీలు ,ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు ..