YSRCP Nandigama : మద్దులమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ..

YSRCP Nandigama :

 

ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల మండలం :
ది.30-11-2022(బుధవారం) ..

మద్దులమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

మద్దులమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

కంచికచర్ల మండలంలోని గొట్టుముక్కల గ్రామ శివారులో గల మద్దులమ్మ తల్లి అమ్మవారిని శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు బుధవారం దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్దులమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని , కంచికచర్ల మండలంలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అమ్మవారిని ఎంతో నమ్మకంతో కొలుస్తారని తెలిపారు ,అమ్మవారి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని , ఆలయానికి వెళ్లే రోడ్డు మరమ్మతులు – ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా తాగునీటి బోరు ఏర్పాటు – భక్తులు కూర్చోవడానికి – పాలపొంగళ్ళు నిర్వహించుకోవడానికి షెడ్డు నిర్మాణం – ఎలక్ట్రిసిటీ సదుపాయం కల్పిస్తానని హామీ ఇచ్చారు ..

ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..

 

YSRCP Nandigama : నియోజకవర్గంలోని జలజీవన్ మిషన్ పనులపై సమీక్ష సమావేశం..

#ysrcp_nandigama

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *