YSRCP Nandigama : గుడిమెట్ల మరియు లక్ష్మీపురం గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణాలకు శంకుస్థాపన

YSRCP Nandigama :

 

 

ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు మండలం :
ది.30-11-2022(బుధవారం) ..

గుడిమెట్ల మరియు లక్ష్మీపురం గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంగన్వాడీలకు మహర్దశ ..

చందర్లపాడు మండలంలోని లక్ష్మీపురం మరియు గుడిమెట్ల గ్రామాలలో ఒక్కొక్క అంగన్వాడి కేంద్రానికి రూ.16 లక్షల చొప్పున వెరసి మొత్తంగా రూ.32 లక్షలతో చేపట్టనున్న 2 అంగన్వాడి కేంద్రాల భవన నిర్మాణాలకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు బుధవారం శంకుస్థాపన నిర్వహించారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారని ,ఇప్పుడు వాటిలో సౌకర్యాల కల్పన ఆధునీకరణపై దృష్టి సారించారన్నారు ,అలాగే కొత్త కేంద్రాల నిర్మాణాలు చేపట్టి ఆధునీకరణ ఉట్టిపడేలా అంగన్‌వాడీ కేంద్రాలను రూపుదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించి ,ఒకవైపు చిన్నారులకు బోధన, సమతుల్య ఆహారం పంపిణీతో పాటు గర్భిణీలకు అన్ని వసతులు ఒకేచోట లభించేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు ,ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలను దశలవారీగా సొంత భవనాల్లోకి మార్చే ప్రక్రియకు వైయస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ,ప్రీ స్కూళ్లలో బోధన అత్యంత సులువుగా ఇంగ్లీష్‌ మీడియంలో సాగించేందుకు అవసరమైన కిట్లను ఇప్పటికే సరఫరా చేస్తున్నట్లు చెప్పారు ,మరోవైపు బాలింతలు, గర్భిణీలకు పౌష్టికాహారాన్ని, పాలు, ఇతర మందులను అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా అందించే దిశగా చర్యలు తీసుకుందన్నారు ,ఈ నిర్మాణంలో బోధనా సాగించేందుకు గదులతో పాటు వంట గది, టాయిలెట్లు, ఆటస్థలం ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. అన్ని ఆధునిక హంగులతో నిర్మాణం చేయనున్న భవనాలకు ప్రహరీ గోడను కూడా నిర్మించనున్నట్లు వివరించారు ..

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆల సైదమ్మ , వైస్ ఎంపీపీ కల్పన ,జడ్పిటిసి ముక్కపాటి నరసింహారావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆల రామారావు , యార్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్ ,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు , మండల పార్టీ కన్వీనర్ కందుల నాగేశ్వరరావు మరియు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు ..

YSRCP Nandigama : పట్టణంలోని 11 వ వార్డు లో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *