TS ACB Raid: ఏసీబీకి చిక్కిన మహిళా అధికారి, ఇంట్లో లక్షల్లో నగదు స్వాధీనం, ట్రైబల్ వెల్ఫేర్ ఉద్యోగి నిర్వాకం…

Best Web Hosting Provider In India 2024

TS ACB Raid: గిరిజన సంక్షేమ శాఖ Tribal welfare ఆధ్వర్యంలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేసిన మహిళా అధికారి ఏసీబీకి చిక్కింది. చేసిన పనులకు బిల్లులు చెల్లించడానికి లంచం డిమాండ్ చేయడంతో విసిగిపోయిన కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు.

 

ట్రెండింగ్ వార్తలు

నగదుతో పట్టుబడిన ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారి జగత్ జ్యోతి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీకి కళ్లు చెదిరేలా నగదు దొరికింది. ఆమె ఇంట్లో ఎక్కడపడితే అక్కడ నగదు దొరకడంతో ఏసీబీ సిబ్బంది అవాక్కయ్యారు. ఆమె ఇంట్లో ఇంటిలో 66 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

నగదుతో పాటు నాలుగు కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనంచేసుకున్నారు. నిందితురాలు రూ. 84 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కారు.

ట్రైబల్‌ వెల్ఫేర్‌ శాఖ చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయడానికి లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమశాఖ ఇన్‌ఛార్జి ఎస్‌ఈ కె.జగజ్యోతి సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

గంగన్న అనే కాంట్రాక్టర్‌కు నిజామాబాద్‌లో పూర్తి చేసిన పనికి బిల్లులు మంజూరు చేయాల్సి ఉంది. దీంతో పాటు హైదరాబాద్‌ శివార్లలోని గాజుల రామారంలో గిరిజన సంక్షేమ శాఖ నిర్మిస్తున్న జువైనల్‌ బాలుర వసతి గృహం కాంట్రాక్టునూ కూడా ఆయనే దక్కించుకున్నారు.

నిజామాబాద్‌లో ఇప్పటికే పూర్తయిన పనికి బిల్లులు మంజూరు చేయడం, గాజుల రామారం పనికి అంచనాలు సవరించడానికి ఎస్‌ఈ జగజ్యోతి లంచం డిమాండు చేశారు. దీంతో కాంట్రాక్టర్‌ గంగన్న అనిశా అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ఆధారంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు మాసబ్‌ ట్యాంక్‌లోని కార్యాలయంలో రూ.84 వేలు లంచం తీసుకుంటున్న జగజ్యోతిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు.

 

ఎస్‌ఈ ఇంట్లో రూ.65 లక్షల నగదు, నాలుగు కిలోల బంగారం Goldలభ్యమైనట్లు అధికారులు తెలిపారు. ఆమె పనిచేస్తున్న కార్యాలయంలో కూడా కొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈఈ స్థాయి అధికారి అయిన జగజ్యోతి ఇన్‌ఛార్జి హోదాలో ఎస్‌ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం. నిందితురాలిని ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు.

WhatsApp channel
 

టాపిక్

 
Acb CourtTs PoliceTrending TelanganaTelangana NewsHyderabad

Source / Credits

Best Web Hosting Provider In India 2024