YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు :
ది.29-11-2022(మంగళవారం) ..
డప్పు కళాకారులకు డప్పు కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
కళాకారుల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కృషి ..
చందర్లపాడు గ్రామంలోని మండల పరిషత్ కార్యాలయంలోని మండల పరిధిలోని 136 మంది డప్పు కళాకారులకు ప్రభుత్వం అందజేసిన డప్పు కిట్లను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు మంగళవారం పంపిణీ చేశారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డప్పు కళాకారుల సంక్షేమం, అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని , అందులో భాగంగానే వారికి పింఛన్లను మంజూరు చేయడంతో పాటు వారు కోరిన విధంగా అవసరమైన పనిముట్లు డప్పులు , గజ్జలు, ఏకరీతి వస్త్రాలను మరియు ఇతర పనిముట్లను ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. సమాజంలోని బడుగు బలహీన వెనుకబడిన వర్గాల ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తున్నారని తెలిపారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కస్తాల పున్నమ్మ ,ఎంపీపీ వేల్పుల ఏసమ్మ , జడ్పిటిసి ముక్కపాటి నరసింహారావు ,ఎంపీడీవో ,పార్టీ నాయకులు యార్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్ , మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు , నల్లాని సాయిబాబు , బుగ్గినేని సురేష్, కమతం నర్సిరెడ్డి ,కళాకారుల సంక్షేమ బోర్డు అధికారులు ,వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..