YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.29-11-2022(మంగళవారం) ..
తేజ డివిఆర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు , ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
విద్యార్థులు క్రమశిక్షణతో మెలుగుతూ చదువుల్లో రాణించాలి ..
నందిగామ పట్టణంలోని తేజా డివిఆర్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన ప్రెషర్స్ డే మరియు యూత్ ఫెస్టివల్ వేడుకల్లో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు, శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ..
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ కళాశాలలో సీనియర్ విద్యార్థులు ,జూనియర్ విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని ,విద్యార్థులు ఏర్పరచుకున్న లక్ష్యాలను అధిగమించేందుకు ప్రణాళికాబద్ధంగా చదవాలన్నారు ,తల్లిదండ్రుల ఆశలు -ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు , క్రమశిక్షణతో కూడిన విద్య ద్వారానే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని సూచించారు ,జీవితంలో విద్యార్థి దశ చాలా కీలకమైందన్నారు ,చెడు ఆలోచనల వైపు దృష్టి మళ్లించకుండా మంచివైపుగా ఆలోచించాలని సూచించారు ,జీవన నైపుణ్యాలను అలవర్చుకోవటం ద్వారా ఆత్మ విశ్వాసం పెరుగుతుందన్నారు, తద్వారా ఏ రంగంలోనైనా విజయం సాధించటానికి అవకాశం ఉంటుందన్నారు ..
ఈ కార్యక్రమంలో కళాశాల గౌరవ సలహాదారు ఆళ్ళ రాంబాబు , ప్రిన్సిపల్ సిరివెళ్ల శ్రీనివాసరావు, లెక్చరర్లు బాజీ షరీఫ్, ఆదాం వలీ మరియు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..