ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.08-7-2022 (శుక్రవారం) ..
నందిగామ లో ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 73 వ జయంతి వేడుకలు ..
మహానేత వై.యస్.ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
మహానేత జయంతిని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన కేకును నాయకులు కార్యకర్తలతో కలిసి కట్ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారు ..
వైయస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలన కొన్ని కోట్ల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపింది ..
రైతు అనే పదానికి వన్నె తెచ్చేలా పరిపాలన చేసిన ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచేఉంటారు ..
మహానేత వైయస్ఆర్ స్ఫూర్తితో వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి – మహానేత కంటే నాలుగు అడుగులు ముందుకు వేసి ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పాలన అందిస్తున్నారు ..
పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ..
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు ,అభిమానులు పాల్గొన్నారు ..