YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు మండలం :
నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
చందర్లపాడు మండలంలోని చింతలపాడు గ్రామంలో నూకాలమ్మ అమ్మవారి తిరునాళ్ల ప్రారంభోత్సవం సందర్భంగా గురువారం రాత్రి అమ్మవారిని దర్శించుకున్న శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా ఎంతో వైభవంగా నిర్వహించే నూకాలమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవంలో పాల్గొన్న సంతోషంగా ఉందని , చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అమ్మవారిని ఎంతో నమ్మకంగా కొలుస్తారని తెలిపారు , నూకానమ్మ అమ్మవారి కరుణాకటాక్షాలతో నందిగామ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని -ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..