YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
ది.09-12-2022(శుక్రవారం) ..
రక్షిత మంచినీటి స్టోరేజ్ ట్యాంకుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీటి కుళాయిలు ..
పల్లగిరి గ్రామంలో 60 వేల లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి రూ.49.91 లక్షలు ..
రాఘవపురం గ్రామంలో 20 వేల లీటర్ల వాటర్ ట్యాంకు నిర్మాణానికి రూ.38.92 లక్షలు ..
కమ్మవారిపాలెం గ్రామంలో 60 వేల లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి రూ.52.87 లక్షలు మంజూరు ..
నందిగామ మండలంలోని పల్లగిరి మరియు రాఘవాపురం మరియు కమ్మవారిపాలెం గ్రామాలలో “జల జీవన మిషన్” ద్వారా ఇంటింటికి కుళాయి పథకంలో భాగంగా చేపట్టనున్న రక్షిత మంచినీటి స్టోరేజ్ ట్యాంకుల నిర్మాణ పనులకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు శుక్రవారం శంకుస్థాపన నిర్వహించారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికి సురక్షితమైన మంచినీటిని అందించటమే జలజీవన్ మిషన్ లక్ష్యమని ,జలజీవన్ మిషన్ ద్వారా గ్రామంలోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్లు అందిస్తామని తెలిపారు ,పనులను త్వరితగతిన పూర్తి చేసి తాగునీటిని సరఫరా చేయాలని కాంట్రాక్టర్లకు- అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు సూచించారు , వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులు మరియు పైపులైన్ల ఏర్పాటు పనులను స్థానిక ప్రజాప్రతినిధులు -పార్టీ నాయకులు దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించారు ..
ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు చాగంటి రవికిరణ్ రెడ్డి , పెసరమల్లి సురేష్ , పెంటమాల నిర్మల , జడ్పిటిసి గాదెల బాబు , ఎంపీపీ అరిగెల సుందరమ్మ , వైస్ ఎంపీపీలు ఆకుల రంగా, అన్నం పిచ్చయ్య , ఎంపీటీసీ సభ్యులు వేల్పుల రాము , పెసరమల్లి స్టాలిన్ ,మండల కన్వీనర్ శివ నాగేశ్వరరావు , మాజీ సర్పంచ్ కిషోర్ ,ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ..