Best Web Hosting Provider In India 2024
HBD Janhvi Kapoor: బాలీవుడ్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్న శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ ఇప్పుడు మెల్లగా టాలీవుడ్ లోనూ అడుగుపెడుతోంది. ఇప్పటికే దేవరలో జూనియర్ ఎన్టీఆర్ తో నటిస్తుండగా.. రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీలోనూ ఈ ముద్దుగుమ్మ ఫైనల్ అయినట్లు మేకర్స్ వెల్లడించారు.
ట్రెండింగ్ వార్తలు
ఈ నేపథ్యంలో బుధవారం (మార్చి 6) తన 27వ పుట్టిన రోజు జరుపుకుంటున్న జాన్వీ కపూర్ నటించిన ఓటీటీల్లోని టాప్ 5 మూవీస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇందులో మీరు ఏమైనా చూడాల్సి ఉంటే వెంటనే ప్లాన్ చేసేయండి.
గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ – నెట్ఫ్లిక్స్
గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ మూవీలో జాన్వీ కపూర్ ఓ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గా కనిపించింది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది. గుంజన్ పాత్రలో జాన్వీ చాలా అద్భుతంగా నటించింది. అమాయకత్వం, సాహసం కలగలిపిన ఈ పాత్ర జాన్వీకి బాగా సూటయింది.
గుడ్ లక్ జెర్రీ – డిస్నీ ప్లస్ హాట్స్టార్
కుటుంబ భారాన్ని మోయడం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే జెర్రీ అనే ఓ అమాయక బిహారీ అమ్మాయి పాత్రలో జాన్వీ నటించిన మూవీ గుడ్ లక్ జెర్రీ. 2022లో వచ్చిన ఈ సినిమా నేరుగా డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలోనే రిలీజైంది. ఈ మూవీలో డీగ్లామరస్ రోల్లోనూ జాన్వీ చాలా బాగా నటించింది.
రూహి – నెట్ఫ్లిక్స్
జాన్వీ నటించిన హారర్ జానర్ మూవీ రూహి. 2021లో వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రెండు భిన్నమైన పాత్రల్లో ఆమె అలరించింది. ఓ సాధారణ అమ్మాయి పాత్రతోపాటు దెయ్యం పట్టిన అమ్మాయిగా జాన్వీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
మిలీ – నెట్ఫ్లిక్స్
జాన్వీ కపూర్ నటించిన మరో డిఫరెంట్ జానర్ మూవీ మిలీ. ఇదొక సర్వైవల్ థ్రిల్లర్. ఓ రెస్టారెంట్ లో పని చేసే అమ్మాయి అనుకోకుండా అందులోని స్టోరేజ్ ఫ్రీజర్ లో చిక్కుకుపోతుంది. ఆ రాత్రంతా గడ్డ కట్టించే ఆ చలిలో ఆమె ఎలా బతికి బయటపడుతుందన్నది ఈ మూవీ స్టోరీ. చాలా ఇంట్రెస్టింగా సాగే కథనంతో మిలీ ఆకట్టుకుంది. ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ లో చూడొచ్చు.
బవాల్ – ప్రైమ్ వీడియో
గతేడాది జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ కలిసి నటించిన ఈ సినిమా నేరుగా ప్రైమ్ వీడియోలోనే రిలీజైంది. ఈ లవ్ స్టోరీకి ప్రేక్షకుల నుంచి అంతగా ఆదరణ లభించకపోయినా జాన్వీ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
ఇన్నాళ్లూ బాలీవుడ్ సినిమాలతోనే అలరించిన జాన్వీ కపూర్ ఇప్పుడు తన తల్లి శ్రీదేవి మాతృభాష అయిన తెలుగులోనూ నటించబోతోంది. ఆర్ఆర్ఆర్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ తో దేవర, రామ్ చరణ్ తో ఆర్సీ16తో జాన్వీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి తన తల్లిలాగే జాన్వీ కూడా ఇక్కడి ప్రేక్షకులను అలరిస్తుందేమో చూడాలి.
టాపిక్