Best Web Hosting Provider In India 2024
Sundaram Master OTT: టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష… సుందరం మాస్టర్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అగ్ర హీరో రవితేజ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకొచ్చింది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. సుందరం మాస్టర్ డిజిటల్ హక్కులను ఈటీవీ విన్ ఓటీటీ దక్కించుకున్నట్లు సమాచారం.
ట్రెండింగ్ వార్తలు
మార్చి 22 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. ఈటీవీ విన్ తో పాటు ఆహా ఓటీటీలోనూ సుందరం మాస్టర్ రిలీజ్ కానున్నట్లు తెలిసింది. త్వరలోనే సుందరం మాస్టర్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
రవితేజ ప్రొడ్యూసర్…
సుందరం మాస్టర్ మూవీని ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై రవితేజ నిర్మించాడు. ఈ ఎంటర్టైన్మెంట్ మూవీతో కళ్యాణ్ సంతోష్ దర్శకుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సుందరం మాస్టర్ ప్రమోషన్స్‌లో చిరంజీవి, నాగచైతన్యతో పాటు పలువురు స్టార్లు పాల్గొనడం, టీజర్, ట్రైలర్స్ ఆకట్టుకుకోవడంతో ఈ చిన్న సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.
పాయింట్ బాగున్నా ఆశించిన స్థాయిలో కామెడీ పండకపోవడంతో సుందరం మాస్టర్ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. థియేట్రికల్ రన్లో నాలుగు కోట్ల వరకు వసూళ్లను రాబట్టిన ఈ మూవీ నిర్మాతలకు మోస్తారు లాభాలను తెచ్చిపెట్టినట్లు సమాచారం.
సుందరం మాస్టర్ కథ ఇదే…
అడవి మధ్యలో ఉన్న మిర్యాల మెట్ట అనే ఊరివాళ్లు తమకు ఇంగ్లీష్ టీచర్ కావాలని ఎమ్మెల్యేను కోరుతారు. ఆ ఊరికి సుందరం మాస్టర్‌ను టీచర్‌గా పంపిస్తాడు ఎమ్మెల్యే. కానీ ఊరిలోని వారందరూ ఇంగ్లీష్ గడగడ మాట్లాడేస్తూ సుందరం మాస్టారుకే పరీక్ష పెడతారు.
ఆ టెస్ట్‌లో ఫెయిలయితే ఉరి తీసి చంపేస్తామని సుందరం మాస్టారును బెదిరిస్తారు. ఆ టెస్ట్‌లో సుందరం మాస్టర్ పాసయ్యాడా? సుందరం మాస్టారును ఇంగ్లీష్ టీచర్‌గా ఆ ఊరికి ఎమ్మెల్యే ఎందుకు పంపించాడు? ఆ ఊరిలో ఉన్న ఓ విలువైన వస్తువు ఆచూకీ సుందరం మాస్టర్ కనిపెట్టాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
వంద సినిమాలు…
ఈ సినిమాలో సుందరం మాస్టర్‌గా వైవా హర్ష తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు.మిర్యాల మెట్ట ఊరివాళ్లతో ఇంగ్లీష్ మాట్లాడే సీన్స్ ప్రేక్షకుల్ని అలరించాయి. కామెడీకి చిన్న సందేశాన్ని జోడించి దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు.
సుందరం మాస్టర్ సినిమాలో దివ్య శ్రీపాద కీలక పాత్రలో నటించింది. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందించాడు.చిన్న షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్‌ను ప్రారంభించిన వైవా హర్ష కమెడియన్‌గా వందకుపైగా సినిమాలు చేశాడు. . ఎక్కడికి పోతావు చిన్నవాడా, కలర్ ఫొటో, కార్తికేయ 2, బేబీతో పాటు ఇటీవల రిలీజైన ఊరు పేరు భైరవకోన పలు సినిమాల్లో కమెడియన్‌గా కనిపించాడు.
కాన్సెప్ట్ బేస్డ్ కథాంశాలతో కూడిన చిన్న సినిమాలను ప్రోత్సహించేందుకు ఆర్టీ టీమ్ వర్క్స్ పేరుతో రవితేజ ఓ ప్రొడ్యక్షన్ హౌజ్‌ను స్థాపించారు. ఈ బ్యానర్‌పై గతంలో చాంగురే బంగారు రాజా, లింగోచ్చా సినిమాలను ప్రొడ్యూస్ చేశాడు.కానీ హిట్టు మాత్రం దక్కలేదు.
టాపిక్