Best Web Hosting Provider In India 2024
భారతదేశంలో చూసేందుకు చాలా ప్రదేశాలు ఉన్నాయి. అనేక ప్రాంతాలు, అనేక సంస్కృతులకు నిలయం మనం దేశం. అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రజల అలవాట్లు కాస్త ఆసక్తిగా అనిపిస్తాయి. అలాంటి వాటిలో మేఘాలయలోని విస్లింగ్ విలేజ్ ఒకటి. మేఘాలయ చూసేందుకు చాలా ప్రదేశాలు ఉంటాయి. ప్రకృతికి దగ్గరగా గడపవచ్చు. అయితే ఇక్కడ ఆచారాలు కూడా మనకు కాస్త భిన్నంగా ఉంటాయి.
ట్రెండింగ్ వార్తలు
అందమైన ప్రాంతం
మేఘాలయలోని కాంగ్‌థాంగ్ గ్రామాన్ని విజిల్ గ్రామం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఒకరినొకరు పేరు పెట్టి పిలవరు, ఈలలు వేస్తారు. కాంగ్‌థాంగ్ తూర్పు ఖాసీ కొండలలో ఒక అందమైన ప్రాంతం. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నుండి దాదాపు 60 కి.మీ ప్రయాణించాలి. అక్కడ నుంచి వెళితే ఈ ప్రశాంతమైన, అందమైన ప్రత్యేకమైన గ్రామాన్ని చేరుకోవచ్చు.
ట్యూన్‌తో పేరు
ఇక్కడి ప్రజలకు రెండు పేర్లు ఉంటాయి. ఒకటి సాధారణ పేరు, ఇక మరొకటి వెరైటీగా విజల్ ద్వారా ట్యూన్. ఈ విజిల్‌లోనూ పేరుకు రెండు రకాలు ఉన్నాయి. మొదటిది పొడవైన విజిల్, రెండోది చిన్న విజిల్. తల్లి తన బిడ్డకు ఇచ్చే రాగం వేరుగా ఉంటుంది. కుటుంబంలో తమలో తాము సంభాషించుకోవడానికి ఉపయోగించే రాగం వేరేగా ఉంది.
పిలుపులకు రాగాలు
పెద్దలు తమ కోసం లేదా గ్రామంలోని ఇతర వ్యక్తులను ఆహ్వానించడానికి కూడా రాగాలను కంపోజ్ చేస్తారు. ఈ గ్రామంలో చాలా తక్కువ పదాలు, ఎక్కువ రాగాలు ఉన్నాయి. గ్రామంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈలల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఇది వింతగా అనిపించినప్పటికీ, ఇక్కడ ఈ ప్రత్యేకమైన సంప్రదాయం మీకు కచ్చితంగా నచ్చుతుంది.
ఇదంట అసలు విషయం
కాంగ్‌థాంగ్ ప్రజలు ఇప్పటికీ ఈ పురాతన సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. ఈ అభ్యాసం ఎలా మొదలైందనే దాని గురించి ఒక కథ కూడా ఉంది. ఒకసారి ఇద్దరు స్నేహితులు ఎక్కడికో వెళ్తున్నారు. దారిలో కొందరు దొంగలు వారిపై దాడి చేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు ఒకరు చెట్టు ఎక్కారు. అప్పుడు అతను తన స్నేహితులను పిలవడానికి కొన్ని పదాలు ఉపయోగించాడు. స్నేహితుడు ఈ విషయాన్ని అర్థం చేసుకుని తదనుగుణంగా వ్యవహరించడంతో వారిద్దరూ కూడా దొంగల నుంచి తప్పించుకున్నారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం మొదలైందని అంటారు.
ఈ విజిల్స్ బిడ్డ పుట్టిన తర్వాత తల్లి సృష్టించినవే. పుట్టిన తర్వాత, శిశువు చుట్టూ నివసించే వ్యక్తులు ఆ ట్యూన్‌ను నిరంతరం హమ్ చేస్తూ ఉంటారు. తద్వారా శిశువు ధ్వనిని బాగా గుర్తిస్తుంది.
ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి ఇంటికి ఒక్కో రాగం ఉంటుంది. ఒక రాగం లేదా విజిల్ ద్వారా ఇక్కడ నివసించే ప్రజలు ఒక వ్యక్తి ఏ ఇంట్లో ఉన్నారో చెప్పగలరు. ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా. కాంగ్‌థాంగ్ అనే చిన్న గ్రామంలో 600 మందికి పైగా నివసిస్తున్నారు. అంటే ఇక్కడ 600కు పైగా రాగాలు వినిపిస్తాయి.
ఒక్కసారి వెళ్లి రండి
మీరు ఏ సమయంలోనైనా ఇక్కడకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. అయితే అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు ఇక్కడ సందర్శించడానికి ఉత్తమ సమయం. ఇక్కడి ప్రకృతి అందాలు, మనుషులు, సంప్రదాయాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. కాంగ్‌థాంగ్‌కు రహదారి సులభం కాదు. ఈ గ్రామానికి చేరుకోవాలంటే దాదాపు అరగంట పాటు ట్రెక్కింగ్ చేయాలి. మీరు ఈ ట్రెక్కింగ్‌ని ఎంతో ఆనందించవచ్చు. ప్రకృతిలో గడుపుతూ వెళ్లవచ్చు.