YS Jagan In Prakasam: “వైఎస్ శంకుస్థాపన… జగన్ ప్రారంభం” దేవుడి స్క్రిప్ట్‌గా అభివర్ణించిన సిఎం జగన్

Best Web Hosting Provider In India 2024

YS Jagan In Prakasam: ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల సాగు, తాగునీటి కష్టాలను తీర్చే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును వైఎస్సార్‌  Ysr శంకుస్థాపన Foundation  చేస్తే 20ఏళ్ల తర్వాత అదే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆయన ఆయన కొడుకుగా రావడంపై సిఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రారంభించిన 20ఏళ్ల తర్వాత దాదాపు 18కి.మీ పొడవైన రెండు టన్నెల్స్‌ తానే పూర్తి చేసి జాతికి అంకితం చేయడం దేవుడు రాసిన స్క్రిప్ట్ Gods Script అని, ఇందుకు వేరే నిదర్శనం అవసరం లేదన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు

వెలిగొండ ప్రాజెక్టులో బాగంగా 2021 జనవరి 13న మొదటి టన్నెల్‌ Tunnel పూర్తి చేశామని, రెండో సొరంగం పనులు కొద్ది రోజుల క్రితం పూర్తి చేసి జాతికి అంకితం చేసినట్టు సిఎం జగన్ చెప్పారు.ఈ ప్రాజెక్టుతో 4.47లక్షల ఎకరాల సాగునీరు, 15.25లక్షల మందికి రక్షిత తాగునీటిని అందుతుందని చెప్పారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు నీటిని తరలించ వచ్చాన్నరు.

వెలిగొండ ప్రాజెక్టుతో ప్రకాశంలో 20మండలాలు, నెల్లూరులో 5, కడపలో రెండు మండలాల్లోని 15లక్షల మందికి తాగునీటిని అందించనున్నట్టు చెప్పారు. రెండు సొరంగాలు పూర్తి కావడంతో వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో, జూలై, ఆగష్టు నెలల్లో కృష్ణా నదిలో శ్రీశైలం నుంచి నల్లమల్లసాగర్‌ Nallamalla Sagar నుంచి నీటిని తీసుకువచ్చి, అక్కడి నుంచి రిజర్వాయర్‌లో నీళ్లు నిండగానే చూడొచ్చన్నారు.

ప్రాజెక్టులో భాగంగా 3వేల క్యూసెక్కుల సామర్థ్యంతో మొదటి టన్నెల్, రెండో టన్నెల్ 8,500 క్యూసెక్కుల సామర‌్థ్యంలో ఉన్నాయని, శ్రీశైలంలో 840 అడుగుల నీటి మట్టం రాగానే రోజుకు ఒక టిఎంసి నీటిని నల్లమల సాగర్‌ తీసుకు రావొచ్చని చెప్పారు.

వెలిగొండ ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణకు సంబంధించి జులై, ఆగష్టులో నీరు నింపే సమయానికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. భూసేకరణ, పునరావసం, పరిహారాల చెల్లింపును రూ.1200కోట్లతో పూర్తి చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణంలో రెండు టన్నెల్స్ నిర్మాణమే కీలకమని చెప్పారు. రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తైందని, పరిహారం చెల్లించడమే మిగిలి ఉందన్నారు. నీళ్లు నింపే కార్యక్రమాన్ని కూడా అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండు మూడు నెలల్లో పూర్తి చేస్తామన్నారు.

 

ఎర్రగొండపాలెం, దర్శి, ఉదయగిరి ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని తెలిసినా గత ప్రభుత్వ హయంలో పనులు, చంద్రబాబు హయంలో నత్తనడకన సాగాయని జగన్ ఆరోపించారు.

రెండు సొరంగాల్లో మొత్తం 37కిలోమీటర్ల పొడవైన సొరంగాల్లో 2004 నుంచి 2014 వరకు 20కిలోమీటర్ల దూరం పూర్తి చేశారని, 2014-19 మధ్య కేవలం 6.6కిలోమీటర్ల తవ్వకం పూర్తి చేశారని చెప్పారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన 11కిలోమీటర్ల తవ్వకం పనుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి సొరంగాల నిర్మాణం పూర్తి చేసినట్టు చెప్పారు. తన తండ్రి ప్రారంభించిన ప్రాజెక్టును తానే పూర్తి చేసే అవకాశం వచ్చిందన్నారు. ప్రజలకు మంచి చేసే అవకాశం భగవంతుడు ఇచ్చాడన్నారు. ప్రకాశం జిల్లా నుంచి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని సిఎం జగన్ విజ్ఞప్తి చేశారు.

WhatsApp channel
 

టాపిక్

 
 
Prakasam DistrictKrishna RiverSrisailam DamKadapaNelloreYs Jagan

Source / Credits

Best Web Hosting Provider In India 2024