Best Web Hosting Provider In India 2024
Devara Janhvi Kapoor: జాన్వీ కపూర్ బర్త్‌డే సందర్భంగా దేవర టీమ్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. జాన్వీకపూర్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో ట్రెడిషనల్ లుక్‌లో జాన్వీకపూర్ కనిపిస్తోంది. చీరకట్టులో క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటోంది. జాన్వీకపూర్ కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న దేవర సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. దేవరలో తంగం అనే పాత్రలో జాన్వీకపూర్ కనిపించబోతున్నది. దేవర సినిమాతోనే జాన్వీకపూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
దసరాకు రిలీజ్…
దేవరలో గ్లామర్‌కు దూరంగా కంప్లీట్‌గా యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో జాన్వీకపూర్ నటిస్తోన్నట్లు సమాచారం. దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌ను ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో వాయిదాపడింది. ఇటీవలే ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను రివీల్ చేశారు. దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
నాయకుడిగా ఎన్టీఆర్…
దేవర మూవీలో తీర ప్రాంతాల ప్రజలకు అండగా నిలబడే ఓ నాయకుడిగా ఎన్టీఆర్ కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇటీవల షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో సైఫ్ అలీఖాన్ గాయపడ్డాడు. దాంతో షూటింగ్‌ను వాయిదావేశారు. త్వరలోనే ఈ మూవీ కొత్త షెడ్యూల్ పునః ప్రారంభం కాబోతున్నట్లు తెలిసింది.
దేవర మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దేవర సినిమాకు హీరో కళ్యాణ్ రామ్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో దేవర పార్ట్ 1 తెరకెక్కుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో 2016లో వచ్చిన జనతా గ్యారేజ్ మూవీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఈ సక్సెస్ తర్వాత దాదాపు ఎనిమిదేళ్ల గ్యాప్ అనంతరం ఎన్టీఆర్, కొరటాల శివ కలిసి దేవర మూవీ చేస్తోన్నారు.
ఆర్‌సీ 16లో…
దేవరతో పాటు తెలుగులో రామ్‌చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆర్‌సీ 16లో ఆమె హీరోయిన్‌గా నటిస్తోన్న విషయాన్ని బుధవారం అఫీషియల్‌గా మేకర్స్ అనౌన్స్‌చేశారు. ఆర్‌సీ 16 మూవీని మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధిసినిమాస్ ప్రొడ్యూస్ చేస్తోంది.
ధడక్…
దఢక్ మూవీతో 2018లో హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీకపూర్. రూహి, బవాల్, మిలి సినిమాలు హీరోయిన్‌గా జాన్వీకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆరేళ్లు అయినా బ్లాక్‌బస్టర్ అందుకోలేకపోయింది. రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్‌కథ, తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో మెరిసింది జాన్వీకపూర్.